ETV Bharat / sitara

Adavallu meeku joharlu: 'అందుకే ఈ సినిమాలో నటించా'

author img

By

Published : Mar 1, 2022, 7:02 AM IST

Rashmika sarvanand Adavallu meeku joharlu: 'పుష్ప' చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది హీరోయిన్​ రష్మిక. వరుస విజయాలతో కెరీర్​లో దూసుకెళ్తోన్న ఆమె మార్చి 4న 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర సంగతులను తెలిపింది రష్మిక. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

రష్మిక మంధన
rashmika mandanna

Rashmika sarvanand Adavallu meeku joharlu: 'పుష్ప' సినిమాతో విపరీతమైన క్రేజ్​ సంపాదించుకున్న భామ రష్మిక . అటు టాలీవుడ్​లోనూ, ఇటు బాలీవుడ్​లోనూ వరుస విజయాలతో దూసుకుపోతోంది రష్మిక. చాలా మంది యువత ఆ భామపై మనసు పారేసుకుంటున్నారు. ఇటీవల ఆమె హీరో శర్వానంద్​తో నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చి 4న ధియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర సంగతులను తెలిపింది. ఆ విశేషాలివి..

ఇంతకీ ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఆద్య అనే అమ్మాయిగా నటించా. తన తల్లి వకుళ తరహాలోనే ముక్కుసూటి అమ్మాయి. మనసులో ఒకటి పెట్టుకుని మరోలా డ్రామా చేయడం తన వల్ల కాదని చెబుతుంటుంది. నా గత సినిమాల తరహాలోనే ఇందులో నా పక్కనున్న హీరోని వేధిస్తూ కనిపిస్తుంటా. కాకపోతే ఇందులో ఆ వేధింపులు కొంచెమే లెండి. మా అమ్మకి పెళ్లంటే ఇష్టం లేదు, పెళ్లి చేయడానికి ఇష్టపడదు. నువ్వేం చేస్తావో చేయ్‌, మిగతా విషయాలు నాకు తెలియదని చెబుతుంటా. ఆ సందర్భంలో వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. ఇందులో శర్వానంద్‌తో కలిసి నటించడం మంచి అనుభవం. తను చాలా స్వీట్‌పర్సన్‌. అప్పుడప్పుడు మా కోసం ఇంటి భోజనాన్ని తెప్పించి రుచి చూపేవాడు.

పుష్ప’లో శ్రీవల్లికి పూర్తి భిన్నంగా కనిపించే పాత్రని చేసినట్టున్నారు..?

చాలా భిన్నమైన పాత్ర. కాకపోతే శ్రీవల్లి పాత్రనుంచి బయటికొచ్చి నటించడం నాకు సులభంగానే అనిపించింది. ఒకవేళ ‘పుష్ప’ కాకుండా.. ‘భీష్మ’ తరహా సినిమా చేస్తూ, ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చేసుంటే రెండూ ఒకే రకమైన పాత్రలు కాబట్టి కష్టంగా అనిపించేదేమో. ఈ సినిమా సెట్‌లో విహారయాత్రకి వచ్చినట్టుగా ఉండేది. చాలా సరదాగా, మా ఆడవాళ్లందరితో కలిసి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ నటించా.

ఈ సినిమా ఒప్పుకోవడం వెనక ప్రధానమైన ఓ కారణం చెప్పమంటే?

లాక్‌డౌన్‌లో ఈ కథని విన్నా. దర్శకుడు తిరుమల కిషోర్‌ కథ చెప్పడం ఆరంభించగానే నవ్వుకోవడం మొదలుపెట్టా. ఆ తర్వాత ఊర్వశి, రాధిక, ఖుష్బూ, ఝాన్సీ, కళ్యాణి... ఇలా సీనియర్‌ నటులంతా ఇందులో ఇతర ఆడవాళ్ళుగా నటిస్తారని చెప్పారు. పైగా ఇందులో విరామ సందర్భంలో వచ్చే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది చాలా ఫన్నీగా ఉంటుంది. అలాగే ద్వితీయార్ధంలో మరో ఘట్టం ఉంటుంది. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చేయడానికి ప్రధాన కారణాలు ఈ సన్నివేశాలే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతితో, ఇందులో రాధిక, ఖుష్బూ, ఊర్వశిలతో కలిసి తెరను పంచుకున్నారు. ఆ అనుభవాల్ని పంచుకుంటారా?

ఆ అవకాశం నాకే వచ్చిందేమో నిజంగా! విజయశాంతితో ఇప్పుడూ టచ్‌లోనే ఉన్నా. తరచూ మాట్లాడుతుంటా. ఖుష్బూ, రాధిక, ఊర్వశి తదితర నటుల గ్రేసే వేరు. సెట్లో చిత్రీకరణ విరామంలో చాలా సాదాసీదాగా అందరూ కూర్చుని గమ్మత్తైన విషయాలు మాట్లాడుకుంటూ గడుపుతుంటారు. ఒక్కసారి దర్శకుడు యాక్షన్‌ కోసం పిలవగానే అందరూ ఆ పాత్రల్లాగే మారిపోతారు. అది నాకు షాక్‌కి గురిచేసే విషయం. ఏళ్లకి ఏళ్లు పనిచేసిన అనుభవం అక్కడ కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో వీళ్లందరితో కలిసి నటిస్తున్నానని మా నాన్నకి ఫోన్‌ చేసినప్పుడు ‘అంత మంచి నటులైన వాళ్ల మధ్య నువ్వేం చేస్తావ’ని అన్నారు. భయపడటం కంటే ఈ ప్రయాణంలో వాళ్లని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. ఇంత బాగా నటిస్తున్నారు కదా, నేనూ చేయాలనే ప్రేరణ నాలో కలిగింది.

బాలీవుడ్‌లో కరణ్‌జోహార్‌తో కలిశారు ఈమధ్య. కొత్త సినిమా ఒప్పుకొన్నారా?

అలాంటి మీటింగ్స్‌ చాలానే జరుగుతుంటాయి. కొత్త ప్రాజెక్ట్‌ ఏదైనా నిర్మాతలు చెప్పందే నేను బయట పెట్టలేను. ‘పుష్ప2’ తర్వాత కొత్త సినిమాలు చేయాల్సినవి ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే చెబుతాను. నేను కొంచెం ఆచితూచి కథల్ని ఎంపిక చేసుకుంటుంటాను కదా!

మహిళా నేపథ్యంలో సాగే ఈ కథని రాసిన దర్శకుడి గురించి ఏం చెబుతారు?

దర్శకుడు తిరుమల కిషోర్‌కి మహిళలపట్ల ఉన్న గౌరవాన్ని చాటి చెప్పే చిత్రమిది. ఇలాంటి కథని, పాత్రల్ని ఎలా రాస్తుంటారని అడిగా. మన ఇంట్లో అమ్మ, చెల్లితో కలిసి కూర్చున్నప్పుడు, వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి మాటలు వినిపిస్తాయో, ఆ నేపథ్యంలో రాసుకున్న సరదా సంభాషణల్నే ఇందులో రాశా అని చెప్పేవారు. కిషోర్‌ సహజమైన సంభాషణల్ని చాలా బాగా రాస్తారు. లోతైన భావం ఉంటూనే అందులో తన మార్క్‌ కామెడీ ఉంటుంది.

మీ సినిమా వేడుకకి తోటి కథానాయికలైన సాయిపల్లవి, కీర్తిసురేష్‌ రావడం ఎలా అనిపించింది?

పక్కన తోటి అమ్మాయి ఉందంటే మరింత ఆత్మ విశ్వాసం కదా. నాకూ అలాగే అనిపించింది. దర్శకుడు మన వేడుకకి ఇలా కీర్తి, సాయిపల్లవి వస్తున్నారనగానే చాలా సంతోషంగా అనిపించింది. ఒక నటి సినిమా వేడుకకి మరో నటి వచ్చి ప్రోత్సహిస్తుందంటే అది ఎంత గొప్ప విషయం. సాయి పల్లవికీ, కీర్తికీ ప్రేక్షకుల నుంచి లభించిన స్పందనకి వాళ్లు పూర్తి అర్హులు. మరింతగా కష్టపడొచ్చనే ప్రోత్సాహాన్నిచ్చే స్పందన అది.

చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఇలా ఒకరిని దృష్టిలో ఉంచుకుని ఈ పాత్రని రాసుకున్నాం, ఇలాంటి కారణాలతో మీ దగ్గరికి వచ్చాం అంటూ కథ, పాత్రల్ని చెబుతున్నప్పుడు ‘ఓహో.. వాళ్ల కోసం రాసిన పాత్రా? నిజంగా అలా రాయడం ఎంత మంచి విషయం కదా’ అనిపించేది. ఆయా నటుల హావభావాల్ని దృష్టిలో పెట్టుకుని కథ రాయడం, ఆ పాత్రని వాళ్లే చేయడం చాలా బాగుంటుంది. అలా నా కోసమే ఈ పాత్ర రాసినట్టు దర్శకుడు కిషోర్‌ చెప్పాడు. ఒక నటికి అరుదుగా వచ్చే అవకాశం అది. ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది’’.

ఇదీ చదవండి: 'ఆదిపురుష్​' నుంచి అదిరిపోయే అప్​డేట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.