ETV Bharat / sitara

ఆరేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను: నటి రష్మీ - క్యాస్టింగ్ కౌచ్

టీవీ నటి రష్మీ దేశాయ్.. చిన్నతనంలో, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు జరిగిన వేధింపుల గురించి బయటపెట్టింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాల్ని వెల్లడించింది.

ఆరేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను: నటి రష్మీ
టీవీ నటి రష్మీ దేశాయ్
author img

By

Published : Mar 4, 2020, 3:08 PM IST

బుల్లితెరలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాల్లో నటించి, ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది నటి రష్మీ దేశాయ్‌. ఇటీవలే ఆమె.. సినీపరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పింది. సూరజ్‌ అనే వ్యక్తి తనను ఎన్నో విధాలుగా వేధింపులకు గురిచేశాడని ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. చిన్నతనంలో ఓసారి ఇలాంటి ఇబ్బందులే తనకు ఎదురయ్యానని చెప్పిందీ భామ.

'నేను ఓసారి బస్సులో వెళుతుండగా, ఓ అంకుల్ నా పక్కన కూర్చొని, నన్ను తాకరాని చోట తాకాలని చూశాడు. నాకు అప్పుడు ఆరు లేదా ఏడేళ్లు ఉంటాయనుకుంటా' అని రష్మీ చెప్పింది.

tv actress Rashmi Desai
టీవీ నటి రష్మీ దేశాయ్

'13 ఏళ్ల క్రితం నేను యుక్తవయసులో ఉన్నప్పుడే నా కెరీర్‌ ప్రారంభించాను. సినీరంగంతో ఎటువంటి సంబంధాల్లేని ఓ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. వచ్చిన కొత్తలో ఎవరూ తెలియదు. క్యాస్టింగ్ కౌచ్‌కు అంగీకరించకపోతే.. ఆఫర్స్‌ పొందలేనని సూరజ్‌ అనే వ్యక్తి చెప్పాడు. ఇప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాకు ఏమి తెలియదని భావించి.. అతను నా గురించి అన్నీ విషయాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత చాలాసార్లు ఏదో ఒక రకంగా వేధించాలని చూశాడు' అని రష్మీ దేశాయ్ చెప్పింది.

'ఓ రోజు సూరజ్‌, నాకు ఫోన్‌ చేసి ఆడిషన్‌ కోసం రమ్మని చెప్పాడు. నేను చాలా సంతోషంగా వెళ్లాను. తీరా వెళ్లి చూస్తే.. నేను తప్పా వేరే ఎవరూ లేరు. ఆ సమయంలో సూరజ్‌ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను నాతో తాగించాలని చూశాడు. నన్ను మత్తులోకి దించాలని ప్రయత్నించాడు. నేను వద్దని చెప్పి.. ఎంతో కష్టపడి అక్కడి నుంచి బయటపడ్డాను. వెంటనే ఇంటికి చేరుకుని మా అమ్మతో జరిగిన విషయం చెప్పాను. ఆ తర్వాత రోజు మా అమ్మను తీసుకుని సూరజ్‌ దగ్గరికి వెళ్లాను. మా అమ్మ అతన్ని చెంపదెబ్బ కొట్టింది' అని రష్మీ చెప్పింది.

ఇది చదవండి: స్పెషల్: వెండితెర టైమ్‌ మిషన్స్‌ వచ్చేస్తున్నాయ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.