ETV Bharat / sitara

'ఇస్మార్ట్ శంకర్'​గా రణ్​వీర్ సింగ్! - రణ్​వీర్ సింగ్

రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమాను బాలీవుడ్​లో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందులో రణ్​వీర్ సింగ్ హీరోగా నటిస్తాడని సమాచారం.

Ranveer sing will turns Ismrat Shankar
'ఇస్మార్ట్ శంకర్'​గా రణ్​వీర్ సింగ్!
author img

By

Published : Oct 4, 2020, 8:07 PM IST

తెలుగులో విశేష ప్రేక్షకాదరణ పొందిన చాలా చిత్రాలు బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమకు నచ్చిన కథల్ని అక్కడి హీరోలతో పునఃనిర్మిస్తున్నారు హిందీ చిత్ర సీమ దర్శక, నిర్మాతలు. ఈ జాబితాలో 'ఇస్మార్ట్‌ శంకర్‌' నిలవనుంది.

రామ్‌ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన చిత్రమిది. నభానటేష్‌ , నిధి అగర్వాల్‌ నాయికలు. పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్‌ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచే పాత్ర ఇది. అందుకే బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఈ సినిమాపై మనసు పడ్డాడని సమాచారం. ఈ చిత్రానికి హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామ్‌ పాత్రలో నటించేందుకు రణ్‌వీర్‌ ఆసక్తి చూపిస్తున్నాడని టాక్‌. మరి దర్శకుడు ఎవరనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.