కంగనా రనౌత్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆసక్తి తనకి లేదని తెలిపాడు బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్. సామాజిక, రాజకీయ అంశాలపై ఆలియా భట్, రణ్బీర్ స్పందించరని కంగనా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఎవరో ఏదో అనుకుంటారని ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆసక్తి నాకు లేదు. నేనేంటో నాకు తెలుసు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. -రణ్బీర్ కపూర్, బాలీవుడ్ నటుడు
యువ నటులుగా ఆలియా, రణ్బీర్ని సంబోధించడాన్ని కూడా కంగనా తప్పు పట్టింది. వారిరువురు వయసులో చాలా పెద్దవారని... ఎన్నో సినిమాలు చేశారని, యువ నటులుగా ఎలా పిలుస్తారంటూ ఎద్దేవా చేసింది బాలీవుడ్ క్వీన్.