ETV Bharat / sitara

చరణ్​ ఆ డైలాగ్​ కోసం 80 టేక్​లు తీసుకున్నాడు: రాజమౌళి - ఆర్​ఆర్​ఆర్ మూవీ రానా ఇంటర్వ్యూ

ప్రమోషన్స్​లో భాగంగా 'ఆర్​ఆర్​ఆర్' టీమ్​ను ఇంటర్వ్యూ చేశారు హీరో రానా. వారి సంభాషణలు ఆసక్తికరంగా సరదాగా సాగాయి. అవి వారి మాటల్లోనే..

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Mar 23, 2022, 11:19 PM IST

Updated : Mar 24, 2022, 6:23 AM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'ఆర్​ఆర్​ఆర్'. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో బిజీగా గడుపుతోంది చిత్రబృందం. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలను ఇస్తోంది. తాజాగా హీరో రానాతో కలిసి సినిమా విశేషాల గురించి ముచ్చటించారు. ఆ సంగతులు వారి మాట్లల్లోనే...

రానా: మీరు ముందు నుంచే స్నేహితులా? ఈ సినిమా ద్వారా దగ్గరయ్యారా?

తారక్​: మేం సినిమా కన్నా ముందే మంచి స్నేహితులం. 'ఆర్​ఆర్​ఆర్'​ మా మధ్య బంధాన్ని మరింత పెంచింది. వృత్తిపరంగా ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవడం, మాలో ఉన్న ప్లస్​,​ మైనస్​లు​ తెలిశాయి. చరణ్​ ఇంట్రావర్ట్​.

రానా: తారక్​, చరణ్​లో ఎలాంటి మార్పును గమనించారు?

రాజమౌళి: తారక్​ పుట్టుకతోనే టాలెంట్. కెరీర్​ ప్రారంభం నుంచి ఇప్పటికీ ఎనర్జిటిక్​గానే ఉంటాడు. అయితే మొదట్లో కథలను ఎలా ఎంచుకోవాలో తెలీదు. ఎంచుకున్న కథ, తన పాత్ర సినిమాను సక్సెస్​ చేస్తాయని అన్న అవగాహన కూడా లేదు. తర్వాత పరిపక్వత చెందాడు. ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలుసుకున్నాడు. యాక్టింగ్​ విషయానికొస్తే అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాడు.

చరణ్​లో కూడా మంచి ప్రతిభ ఉంది. అతడు కూడా తారక్​ లాగే. మొదట్లో ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలీదు. క్రమక్రమంగా దానిపై అవగాహన పెంచుకున్నాడు. అయితే ఇప్పుడు తనలో ఉన్న బలాన్ని, ప్రతిభను గుర్తుపట్టి నమ్మడం ప్రారంభించాడు. తన మైండ్​ను ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలానో నేర్చుకున్నాడు. యాక్టింగ్ బాగా చేస్తాడు. ఓ సారి అతడు డబ్బింగ్ చెప్పేటప్పుడు​ ఓ పదం సరిగ్గా రావట్లేదు. దాదాపు 70, 80 టేక్​లు జరిగాయి. కానీ అతను సహనం కోల్పోలేదు. బాగా చెప్పాలన్నా తపనతోనే ఉన్నాడు. అది నాకు చాలా నచ్చింది.

రానా: రాజమౌళిలో అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపించిదా?

తారక్: ఒక దర్శకుడుగా ​ఆయనలో ఎటువంటి మార్పు లేదు. కాస్త వయసు మాత్రమే పెరిగింది. జక్కన్న ఎప్పుడూ మంచి విజువల్​ సినిమాలు తీయాలనే ఆలోచనతో ఉంటారు. విజయాలు కూడా అలానే పొందుతారు.
చరణ్​: జక్కన్న ప్రేక్షకులకు కథ చెప్పడంలో సుప్రసిద్ధులు. బాహుబలి నుంచి చూస్తున్నా.. ఆయన కథను అద్భుతం​గా వివరిస్తారు.

రానా: ఇంతకీ ముందులా కాకుండా 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూస్తుంటే బౌండరీలు దాటినట్టు కనిపిస్తుంది. కారణం ఏమంటారు?

రాజమౌళి: నాకు ఎప్పుడూ స్వీక్వెన్స్​ సినిమాలంటే ఇష్టం. సినిమాలో ఎమోషన్స్​ పండించాలి. అవి సరిగ్గా చిత్రీకరించకపోతే ఆడియన్స్​ను మెప్పించలేం. యాక్షన్​ సన్నివేశాల్లో నేను చాలా శ్రద్ధ చూపిస్తాను. మొదట నేను ఎమోషనల్​గా ఫీల్​ అవుతూ చిత్రీకరిస్తా.

రానా: బాలీవుడ్​ యాక్టర్స్​తో పనిచేయడం ఎలా అనిపించింది?

రాజమౌళి: నేను ఎప్పుడూ హిందీ యాక్టర్లు, తెలుగు యాక్టర్లంటూ ఎలాంటి తేడా చూపించను. అందరూ భారతీయ నటులే. ముఖ్యంగా అజయ్​దేవగణ్​ నాకు బాగా సహకరించారు. ఆలియాకు అద్భుతమైన టాలెంట్​ ఉంది. వారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది.

ఇదీ చూడండి: RRR: థియేటర్ల వద్ద ఫుల్​ హంగామా.. అక్కడ జక్నన్నకు భారీ కటౌట్​

Last Updated : Mar 24, 2022, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.