డేనియెల్ క్రేగ్ చివరిసారిగా జేమ్స్‌బాండ్ 007గా చేస్తున్న చిత్రంలో నటించే తారాగణాన్ని నిర్మాతలు ప్రకటించారు. ఫుకునాగ దర్శకత్వం వహిస్తున్నాడు. 2020 ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
![rami-malek-joins-cast-of-new-bond-movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3109415_movie.jpg)
బాండ్ 25వ చిత్రంలో ప్రధాన విలన్‌గా రామి మాలెక్ కనిపించనున్నాడు. ఇటీవలే ఆస్కార్ ఉత్తమ నటుడిగా నిలిచాడీ హాలీవుడ్ నటుడు.
![rami-malek-joins-cast-of-new-bond-movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3109415_baondgd-1.jpg)
బాండ్ పాత్రలో డేనియన్ క్రేగ్ నటిస్తుండగా, లీ సేడక్స్, రాల్ఫా ఫీన్నెస్, నవోమీ హారిస్, బెన్ విషా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.
![rami-malek-joins-cast-of-new-bond-movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3109415_baondgd-2.jpg)
చివరి ఆరు బాండ్ సినిమాలకు పనిచేసిన నీల్ పర్విస్, రాబర్ట్ వేడ్.. ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు.
![rami-malek-joins-cast-of-new-bond-movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3109415_baond.jpg)