ETV Bharat / sitara

ఆ రోజే రామ్​చరణ్​-శంకర్​ సినిమా టైటిల్​ ప్రకటన! - రామ్​చరణ్​ శంకర్​ సినిమా అప్డేట్​

రామ్​చరణ్-శంకర్​ కాంబోలో తెరకెక్కుతున్న 'ఆర్​సీ 15' టైటిల్​ను చరణ్​ పుట్టినరోజున ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. కాగా, బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించిన కొత్త సినిమా 'జల్సా' ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది.

ramcharan
రామ్​చరణ్​
author img

By

Published : Mar 9, 2022, 2:41 PM IST

Shankar ramcharan movie title: శంకర్​ దర్శకత్వంలో మెగాహీరో రామ్​చరణ్​ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఆర్​సీ 15'. మార్చి 27 చరణ్​ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. చిత్ర టైటిల్​ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే 'సర్కారోడు' అనే పేరును ఖరారు చేశారని సినీవర్గాల టాక్​. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే చెర్రీ బర్త్​డే వరకు వేచి ఉండాల్సిందే. ​

కాగా, ఇప్పటికే ఈ మూవీలోని చెర్రీ లుక్​కు సంబంధించిన ఓ చిన్న వీడియో లీక్​ అయింది. ఇందులో చెర్రీ.. ధోతీ ధరించి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు, సైకిల్​ తొక్కుతూ కనిపించారు. ఈ క్లిప్​ చూసిన నెటిజన్లు కమల్​హాసన్​ 'భారతీయుడు' సినిమా గుర్తుకొస్తుందని కామెంట్లు చేశారు. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు రూ.300కోట్లతో ఈ మూవీని రూపొందించనున్నారట! పొలిటికల్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో చెర్రీ.. రెండు విభిన్న గెటప్​లలో కనిపించనున్నారని తెలిసింది. సునీల్, అంజలి, జయరాయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ట్రైలర్​తో విద్యా

Vidyabalan Jalsa trailer: లేడీ ఒరింయేటెడ్​ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఆమె నటించిన 'జల్సా' చిత్రం మార్చి 18నుంచి అమెజాన్​ ప్రైమ్​ వేదికగా స్ట్రీమింగ్​ కానుంది. ​ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్​ను విడుదల చేసింది మూవీటీం. ఉత్కంఠంగా ఉన్న ఈ ప్రచారం చిత్రం ఆద్యంతం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. నటి షెఫాలి ముఖ్య పాత్ర పోషించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: కొత్త సినిమాతో విశ్వక్​ సేన్​.. ఆలస్యంగా రష్మిక​ 'మిషన్ మజ్ను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.