ETV Bharat / sitara

బన్నీ​ బాటలో చరణ్!​.. 'స్కైలాబ్​'​పై నిత్యామేనన్​ ఏమందంటే?

Cinema updates: కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చాయి. ఇందులో రామ్​చరణ్​, నిత్యామేనన్​, సుధీర్​బాబు, కృతిశెట్టి చిత్రాల సంగతులు ఉన్నాయి.

ramcharan nithya menon
రామ్​చరణ్​ నిత్యామేనన్​
author img

By

Published : Jan 17, 2022, 5:30 PM IST

Nithyamenon Skylab movie: నిత్యామేనన్‌, సత్యదేవ్‌, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'స్కైలాబ్‌'. విశ్వక్‌ ఖండేరావు దర్శకుడు. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. తాజాగా సోనీలివ్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా నటి, నిర్మాత అయిన నిత్యామేనన్‌ 'స్కైలాబ్‌' ఓటీటీ విడుదలపై స్పందించారు. థియేటర్‌లలో సినిమాకు ఆశించినంత ఆదరణ లభించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. "స్కైలాబ్‌ థియేటర్‌లలో విడుదలైన సమయంలో మేము ఒక సమస్య ఎదుర్కొన్నాం. సాధారణంగా ఒక సినిమాకు వచ్చే ప్రేక్షకుల కన్నా తక్కువ మంది థియేటర్‌కు వచ్చారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చూడటానికి ఇష్టపడే వాళ్లు కూడా థియేటర్‌కు రాలేదు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. ఏదేమైనా జరిగిన పరిణామాలను అంగీకరించాల్సిందే. దీని గురించి మీరు మాత్రం ఏం చేయగలరు? జీవితం మనకు నచ్చినట్టు ఉండదు కదా! దేన్నీ మనం అంచనా వేయలేం. ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి మనం కొత్త విషయాన్ని నేర్చుకోవాలంతే. అది సినిమా అయినా సరే. అదే సమయంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న సంగతి కూడా గుర్తు పెట్టుకోవాలి" అని నిత్యామేనన్‌ చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని, ఇంకా ఏ సినిమాకు ఓకే చెప్పలేదని అన్నారు. త్వరలోనే మంచి వార్త వింటారని నిత్యామేనన్‌ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Rangasthalam hindi version: హీరో అల్లుఅర్జున్​ నటించిన 'అలవైకుంఠపురములో' హిందీ వెర్షన్​ను నేరుగా థియేటర్లలో జనవరి 26న విడుదల చేయనున్నారు. ఇప్పుడీ చిత్రం బాటలోనే హీరో రామ్​చరణ్​ నటించిన 'రంగస్థలం' హిందీ వెర్షన్​ను కూడా థియేటర్లలో రిలీజ్​ చేయాలని చిత్రబృందం ప్లాన్​ చేస్తోందని తెలిసింది. ఫిబ్రవరిలో దీన్ని విడుదల చేయాలని మూవీటీమ్​ భావిస్తోందట. త్వరలోనే దీని గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, ఈ చిత్రానికి సుకుమార్​ దర్శకత్వం వహించగా.. హీరోయిన్​గా సమంత నటించింది. పూజా హెగ్డే స్పెషల్​ సాంగ్​లో అలరించింది.

Sudheerbabu kritishetty movie: హీరో సుధీర్​బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంద్రగంటి మోహన్​కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నేడు(సోమవారం) విడుదవ్వాల్సిన ఈ మూవీ టీజర్​ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ట్వీట్​ చేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.

sudheer babu
సుధీర్​బాబు-కృతిశెట్టి సినిమా

Ramasura movie ott release: అభినవ్‌ సర్ధార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌, శెర్రి అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రామ్‌ అసుర్‌'. వెంకటేష్‌ త్రిపర్ణ తెరకెక్కించారు. అభినవ్‌, వెంకటేష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్​లో స్ట్రీమింగ్​లో అవుతున్నట్లు సదరు ఓటీటీలో సంస్థ ట్వీట్​ చేసింది.

ఇదీ చూడండి: Skylab Review: 'స్కైలాబ్' ప్రేక్షకులను ఆకట్టుకుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.