ETV Bharat / sitara

ఆ ఊరులో ఓ ప్రాంతానికి 'షోలే' దర్శకుడి పేరు - director name as sippi nagar

కర్ణాటకలోని రామ్​నగరంలోని ఓ ప్రాంతానికి 'షోలే' దర్శకుడి పేరు పెట్టారు. అసలు ఆ ప్రాంతానికి, చిత్రానికి ఉన్న సంబంధం ఏంటి? దీని వెనుకున్న కథేంటి?

rama nagaram colony people named sholay director name to their street
అందుకే ఆ ఊరికి చిత్ర దర్శకుడి పేరు!
author img

By

Published : Nov 12, 2020, 5:35 PM IST

ఊర్లలో గాంధీ నగర్​, నెహ్రూ కాలనీ అంటూ ప్రముఖుల పేర్లు పెట్టుకోవడం కొత్తేమి కాదు. అయితే ఓ సినిమా గౌరవార్థం ఆ చిత్ర దర్శకుడి పేరునే తమ ప్రాంతం పేరుగా పెట్టుకున్నారన్న విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. భారతీయ సినీచరిత్రలో క్లాసిక్స్​లో అగ్రస్థానం సంపాందించుకున్న చిత్రం 'షోలే'. అమితాబ్​ బచ్చన్​, ధర్మేంద్ర, హేమమాలిని లాంటి హేమాహేమీలు నటించిన ఈ సినిమాలోని పాత్రలు ఇప్పటికీ ఎంతోమంది మనుసుల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రతినాయక పాత్ర 'గబ్బర్​సింగ్'​ గురించి నేటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు.

ఈ చిత్రాన్ని బెంగళూరులోని రామ్​నగరం పట్టణం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అక్కడ భారీగా ఉండే గ్రానైట్​ రాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి ఓ ప్రాంతాన్నే గబ్బర్​సింగ్​ దాక్కుని ఉండే డెన్​గా చూపించారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఊరి ప్రజలకు చిత్రబృందంతో మంచి అనుబంధం ఏర్పడింది. తమ ఊరిలో రూపొందిన ఆ చిత్రం మరుపురాని విజయం సాధించడం వల్ల వారు మురిసిపోయారు. అప్పుడే 'షోలే'కు గౌరవసూచకంగా ఆ చిత్ర దర్శకుడు రమేశ్​ సిప్పీ పేరు మీదుగా తమ ఊరిలోని ఓ ప్రాంతానికి సిప్పీ నగర్​ అని పేరు పెట్టుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.