రామ్ - దర్శకుడు కిశోర్ తిరుమల కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'రెడ్'. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లు. తమిళ సూపర్‌హిట్ 'తడమ్'కు రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా రామ్ ద్విపాత్రాభినయం, కిశోర్ తిరుమల టేకింగ్ విమర్శకులను మెప్పించింది.
థియేటర్‌లలో సందడి ముగిసిన తర్వాత ఓటీటీ/టెలివిజన్‌లో ఎప్పుడు ప్రసారమవుతుందా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'రెడ్'ను ఓటీటీ వేదికగా మంగళవారం విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్, సన్‌నెక్ట్స్‌లో ప్రస్తుతం 'రెడ్' స్ట్రీమింగ్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">