టాలివుడ్ యువ కథానాయకుడు రామ్ 'రెడ్' సినిమా చిత్రీకరణ పూర్తికావస్తోంది. ప్రస్తుతం ఇటలీలో రెండు పాటలను తెరకెక్కిస్తున్నారు. వీటికి సంబంధించిన పలు ఫొటోలను ట్విటర్ ద్వారా పంచుకుంది చిత్రబృందం.
రామ్ - కిషోర్ తిరుమల విజయవంతమైన కలయిక. వీళ్లిద్దరూ కలిసి ఇదివరకు ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలు చేశారు. ‘రెడ్’ కోసం ముచ్చటగా మూడోసారి కలిశారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలు. కృష్ణ పోతినేని సమర్పిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన ‘తడమ్’కి రీమేక్‌గా రూపొందుతోంది ఈ సినిమా.
రామ్, మాళవిక శర్మ జంటపై రెండు పాటల్ని తెరకెక్కిస్తున్నారు. శోభి నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.
"ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ చేస్తున్న చిత్రమిది. ఇందులో ఆయన కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. గోవా, హైదరాబాద్, విశాఖల్లో చిత్రీకరించిన సన్నివేశాలతో టాకీ భాగం పూర్తయింది. హైదరాబాద్‌లో జరగబోయే మరో పాటతో సినిమా పూర్తవుతుంది. ముందు ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం."
-స్రవంతి రవికిషోర్, నిర్మాత.
సంగీత దర్శకుడు మణిశర్మ తమ సంస్థలో చేస్తున్న తొలి చిత్రమని వెల్లడించారు రవికిషోర్.
ఇదీ చూడండి : 'లవ్‌స్టోరి' దర్శకుడికి నాగచైతన్య కూల్ గిఫ్ట్