ETV Bharat / sitara

బోయపాటి దర్శకత్వంలో ఎనర్జిటిక్​ హీరో?

author img

By

Published : Mar 21, 2021, 7:04 AM IST

వరుస హిట్లతో జోష్​ మీద ఉన్న ఎనర్జిటిక్​ హీరో రామ్​.. యాక్షన్​ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం చేయనున్నారని సమాచారం. ఇటీవలే బోయపాటి చెప్పిన కథకు రామ్​ అంగీకారం తెలిపారని.. త్వరలోనే షూటింగ్​ ప్రారంభం కానుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Ram Pothineni gives a nod to mass director for his next
బోయపాటి దర్శకత్వంలో ఎనర్జిటిక్​ హీరో?

'ఇస్మార్ట్​‌ శంకర్‌' ఇచ్చిన విజయం తర్వాత.. ఈ ఏడాది 'రెడ్‌' చిత్రంలో నటించి అలరించారు యువ కథానాయకుడు రామ్‌ పోతినేని. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు‌ లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్నారు. 'ఉప్పెన' చిత్ర కథానాయిక కృతి శెట్టి నాయిక. ఈ చిత్రం తర్వాత మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో రామ్​ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యే రామ్‌కు బోయపాటి కథ చెప్పారట. అందుకు రామ్ కూడా అంగీకరించారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. బోయపాటి శ్రీను.. ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ జరుపుకొంటోంది. ఇది పూర్తవ్వగానే రామ్‌-బోయపాటిల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'కథ వినగానే.. ప్రేమలో పడిపోయా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.