రామ్‌గోపాల్ వర్మ.. ఏం చేసినా సంచలనమే.. వివాదాస్పద మాటలు, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా హీరోయిన్ కాళ్ల మీద పడి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు.
'బ్యూటిఫుల్' చిత్రబృందం ప్రీ న్యూ ఇయర్ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో లైవ్‌గా వచ్చింది. ఇందులో వర్మ హీరోయిన్ నైనా గంగూలీ కాళ్ల మీద పడటం అందరిని విస్మయానికి గురిచేసింది. కానీ కొందరు మాత్రం ఈ సంఘటనను ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇవీ చూడండి.. చైతూతో పక్కా.. థ్రిల్లర్ జోనర్‌లో తొలిసారిగా..!