ETV Bharat / sitara

విక్టరీ వెంకటేశ్​తో రామ్​చరణ్ మల్టీస్టారర్! - RRR CINEMA

మలయాళ​ సినిమా 'డ్రైవింగ్​ లైసెన్స్​' తెలుగు రీమేక్​లో హీరోలు వెంకటేశ్, రామ్​చరణ్ కలిసి నటించనున్నారని టాక్. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

RAM CHARAN WITH VENKATESH
విక్టరీ వెంకటేశ్​తో మెగాహీరో రామ్​చరణ్
author img

By

Published : Feb 18, 2020, 6:44 PM IST

Updated : Mar 1, 2020, 6:22 PM IST

ప్రస్తుత జనరేషన్​లో టాలీవుడ్ హీరోలతో మల్టీస్టారర్​ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేశ్. ఇప్పటికే సూపర్​స్టార్ మహేశ్​బాబు, మెగాహీరో వరుణ్​తేజ్, రామ్, నాగచైతన్యలతో నటించేశాడు. ఇప్పుడు మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా చర్చల దశలో ఉందని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

RAM CHARAN WITH VENKATESH
విక్టరీ వెంకటేశ్​తో మెగాహీరో రామ్​చరణ్

మలయాళ ప్రేక్షకుల ముందుకు ఇటీవలే వచ్చిన చిత్రం 'డ్రైవింగ్ లైసెన్స్'. ప్రముఖ కథానాయకుడు పృథ్వీరాజ్ నటించాడు. ఈ సినిమా హక్కుల్ని చరణ్​ ఇటీవలే సొంతం చేసుకున్నాడు. తెలుగులో వెంకటేశ్​ హీరోగా త్వరలో నిర్మించనున్నాడు. ఇందులోని ఓ కీలక పాత్రలోనూ చెర్రీ కనిపించనున్నాడని సమాచారం.

prithviraj IN DRIVING LICENCE
'డ్రైవింగ్​ లైసెన్స్​' సినిమాలో పృథ్వీరాజ్

ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు చరణ్. 'అసురన్' తెలుగు రీమేక్​ 'నారప్ప'లో నటిస్తున్నాడు వెంకీ. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వీరి మల్టీస్టారర్ ఉండొచ్చని టాక్. ​

ఇది చదవండి: ఆ దర్శకుడి కథకు హీరో రామ్​చరణ్ ఫిదా!

Last Updated : Mar 1, 2020, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.