ETV Bharat / sitara

'మన్మథుడు 2'లో ధూమపానంతో రకుల్​ రచ్చ

author img

By

Published : Jul 9, 2019, 12:34 PM IST

Updated : Jul 9, 2019, 1:46 PM IST

నాగార్జున హీరోగా రాహుల్ ర‌వీంద్ర‌న్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌. ఈ సినిమాలో ఆమె పాత్రకు చెందిన ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

'మన్మథుడు 2'లో ధూమపానంతో రకుల్​ రచ్చ

రాహుల్ ర‌వీంద్ర‌న్, నాగార్జున కాంబినేషన్​లో 'మ‌న్మ‌థుడు 2' సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్​ ర‌కుల్ ప్రీత్ సింగ్ అవంతిక పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్రకు సంబంధించిన ఓ వీడియోను మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం.

"అవంతిక.. పేరే ఎంత వినసొంపుగా ఉంది.. అంతే పద్ధతిగల అమ్మాయి''.. అనే డైలాగ్​తో వీడియో ప్రారంభమైంది. "ఈ వయసులో నువ్​ లవ్​ ఫెయిల్యూర్​లు​ తట్టుకోలేవు", "ఇప్పట్నుంచి ఏ సర్టిఫికేట్​ చూపిస్తా" అంటూ నాగ్​తో రకుల్​ పలికిన సంభాషణలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. స్టైలిష్​గా సిగరెట్​ తాగడమే కాకుండా గ్లామరస్​గానూ కనిపించింది రకుల్​.

రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత అతిథి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి కీలక పాత్ర‌ల‌ు పోషించారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్​ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చాడు. 'మ‌న్మ‌థుడు 2' చిత్రం ఆగ‌స్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చిక్కులు తప్పవా..

అజయ్​ దేవగణ్​ సరసన రకుల్​ ప్రీత్​ నటించిన బాలీవుడ్​ చిత్రం 'దే దే ప్యార్​ దే'లో... రకుల్​ మందు బాటిల్​తో డ్యాన్స్​ చేసింది. ఆ సీన్​ తొలగించాలని సెన్సార్​ బోర్డు ఆదేశించింది. ఫలితంగా పూలగుత్తితో మార్పు చేశారు. ప్రస్తుతం 'మన్మథుడు 2' లోనూ ధూమపానం చేస్తూ కనిపించింది. మరోసారి ఈ సినిమాకు చిక్కులు తప్పవేమో అన్న సందేహాలు వస్తున్నాయి. ఏది ఏమైనా సినిమా ప్రచారానికి మాత్రం ఈ పొడుగు సుందరి చేస్తోన్న సీన్లు బాగానే కలిసి వస్తున్నాయి.

  • ఇవీ చూడండి...

రకుల్​ విస్కీ బాటిల్​ మిస్సయ్యిందా..!

రకుల్​ ప్రీత్​ సింగ్​కు నడిరోడ్డుపై వేధింపులు!

నా దగ్గరున్న విషయమే నా అందానికి కారణం: రకుల్​

Last Updated : Jul 9, 2019, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.