హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakulpreet Singh) దృష్టంతా బాలీవుడ్‌పైనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న చిత్రాలన్నీ హిందీవే. వీటిలో 'మేడే', 'థ్యాంక్ గాడ్', 'డాక్టర్ జి', 'ఛత్రివాలి' లాంటి చిత్రాలున్నాయి. అయితే ఇప్పుడీ జాబితాలోకి మరో కొత్త సినిమా చేరినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
తమిళంలో విజయవంతమైన 'రాట్ససన్'(తెలుగులో రాక్షసుడు) చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు నటుడు అక్షయ్ కుమార్(Askhay kumar). రంజిత్ తివారి దర్శకుడు. అక్షయ్, జాకీ భగ్నాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడీ సినిమా కోసం అక్షయ్ కుమార్‌కు జోడీగా రకుల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నిజానికి ఈ పాత్ర కోసం తొలుత కియారా అడ్వాణీ, శ్రద్ధా కపూర్ లాంటి వారి పేర్లు వినిపించినా.. చిత్ర బృందం రకుల్ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్‌లతో బిజీ
కీర్తి సురేశ్(Keerti suresh) చిత్రీకరణలతో బిజీ అవుతోంది. కరోనా పరిస్థితులతో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఈ అమ్మడు.. మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. మంగవారం నుంచి 'సాని కాయిదం' చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.
అరుణ్ మతేశ్వరన్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రమిది. ఇందులో కీర్తితో పాటు దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో కీర్తి ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. డీగ్లామర్ లుక్‌లో దర్శనమివ్వనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో ఆమె ఈ చిత్రంలో ఎలా కనిపించనుందో చూపించేశారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా. వచ్చే ఏడాది ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. కీర్తి ప్రస్తుతం మహేశ్‌బాబు సరసన 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తోంది.
ఇదీ చూడండి: Rakul Preet: బుల్లి గౌనులో.. బబ్లీ బ్యూటీ