ETV Bharat / sitara

కాబోయే వరుడి గురించి బయటపెట్టిన రకుల్! - రకుల్​ ప్రీత్​ పెళ్లి అప్​డేట్స్

తన కలల రాకుమారుడు ఎలా ఉండాలో చెప్పింది నటి రకుల్ ప్రీత్ సింగ్. ఓ మ్యాగజైన్​ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కాబోయే భర్త గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బీచ్​లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపింది.

Rakul Preet Singh
కాబోయే వరుడి గురించి బయటపెట్టిన రకుల్
author img

By

Published : Dec 11, 2020, 10:23 AM IST

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తాజాగా ఆమె ఓ ప్రముఖ బ్రైడల్‌ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. పెళ్లి కుమార్తెలా అలకరించుకుని ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. అలాగే, ఈ మ్యాగజైన్‌ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కలల రాకుమారుడు ఎలా ఉండాలో వివరించింది.

Rakul Preet Singh
వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్

"ప్రేమ, పెళ్లిపై నాకెంతో నమ్మకం ఉంది. నాకు కాబోయే వరుడికి జీవితంపట్ల కచ్చితమైన స్పష్టత, అభిరుచి ఉండాలి. సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం నుంచి వచ్చిన నేను.. నాన్న ఉద్యోగం కారణంగా ఆర్మీకి సంబంధించిన వాతావరణంలో పెరిగాను. కాబట్టి నాకు కాబోయే భర్త.. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని ఫాలో అయితే ఎంతో సంతోషిస్తా. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నా వివాహం జరగాలని ఆశిస్తున్నా. బీచ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనే ఆలోచన ఉంది"

-రకుల్‌ ప్రీత్ సింగ్, నటి.

ఇప్పటివరకు గ్లామర్‌ పాత్రల్లో మెప్పించిన రకుల్‌ మొదటిసారి డీగ్లామర్‌ రోల్‌లో కనిపించనుంది. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె పల్లెటూరి అమ్మాయిగా సందడి చేయనుంది. వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ శివారులో జరిగింది. దీనితోపాటు బాలీవుడ్‌లో అర్జున్‌ కపూర్‌ సరసన ఆమె ఓ సినిమాలో నటించనుంది. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌లో ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ.. అర్జున్‌ కొవిడ్‌-19 బారినపడడం వల్ల మరికొన్నిరోజులు వాయిదా వేశారు.

Rakul Preet Singh
రకుల్ ప్రీత్ సింగ్

ఇదీ చదవండి:జనవరిలో 'భారతీయుడు-2' షూటింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.