స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్.. ఇటీవలే తాను రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది(rakul preet singh husband). బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి వివాహం గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి(rakul marriage announcement). తాజాగా వీటిపై స్పందించింది రకుల్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలని అనుకున్నాను. అందుకే మా రిలేషన్ గురించి చెప్పాను. ఏ విషయంతోనూ ప్రభావితం అవ్వకూడదని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం నా వ్యక్తిగత జీవితం అందంగా ఉంది అందుకే వివరాలు పంచుకున్నాను. ఇక పెళ్లి విషయానికొస్తే అది జరిగేడప్పుడు కచ్చితంగా చెబుతాను. ప్రస్తుతం కెరీర్ మీద దృష్టి పెట్టాను. అందుకే ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను."
-రకుల్ ప్రీత్ సింగ్
కాగా, రకుల్-జాకీ కలిసి దర్శకుడు రంజిత్ ఎమ్ తివారి తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు(rakul preet jackky bhagnani movie). ఈ మూవీలో అక్షయ్‌కుమార్, సర్గున్ మెహ్తా కూడా కనిపించనున్నారు.
తెలుగు సినిమా 'కెరటం'తో హీరోయిన్గా పరిచయమైన రకుల్.. తమిళ, హిందీ భాషల్లోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల 'కొండపొలం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం హిందీలో డాక్టర్ జీ, ఎటాక్, మేడే, అయలాన్, థాంక్ గాడ్, మిషన్ సిండ్రెల్లా, ఇండియన్ 2 సినిమాలు చేస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నానీ కుమారుడైన జాకీ(rakul preet jackky bhagnani).. 'రెహనా హై తేరే దిల్ మే'(2001) సినిమాలో అతిథి పాత్రతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'కల్ కిస్నే దేఖా' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. యంగిస్థాన్, వెల్కమ్ టూ కరాచీ, ఫాల్తూ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. మరోవైపు నిర్మతగా సర్బ్‌జీత్, బెల్ బాటమ్, కూలీ నం.1, జవానీ జానేమన్ సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం టైగర్ష్రాఫ్తో గణపత్ పార్ట్ 1, మహావీర్ కర్ణ చిత్రాల్ని రూపొందిస్తున్నారు.
ఇదీ చూడండి: Rakul preet singh birthday: ఆ నటుడితో రిలేషన్లో రకుల్‌ప్రీత్