సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రం 'రాక్షసుడు'(Rakshasudu). బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రమేశ్ వర్మ(Ramesh Varma) తెరకెక్కించారు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే ఈ చిత్రానికి సీక్వెల్(Rakshasudu Sequel)ను సిద్ధం చేసినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. 'రాక్షసుడు 2' టైటిల్‌తో కూడిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
అయితే సాంకేతిక బృందంలో ఏ మార్పు లేకపోయినా తారాగణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ అగ్ర కథానాయకుడు ఇందులో హీరోగా కనిపించనున్నారు. మరి ఆయన ఎవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. నాయికా వివరాలు ఇంకా ప్రకటించలేదు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా 'ఖిలాడి' చిత్రం తెరకెక్కిస్తున్నారు రమేశ్ వర్మ.
నాగశౌర్య కొత్త చిత్రం
యువ కథానాయకుడు నాగశౌర్య(Naga Shaurya) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా(Naga Shaurya22) తెరకెక్కుతోంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి షెర్లీ సెటియా(Shirley Setia) హీరోయిన్గా నటిస్తుంది. కరోనా సంక్షోభం తర్వాత ఈ సినిమా షూటింగ్ నేడు(మంగళవారం) తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ ట్విట్టర్లో వెల్లడించింది.
'నవరస' సాంగ్
ప్రముఖ దర్శకులు మణిరత్నం (Mani Ratnam)-జయేంద్ర (Jayendra Panchapakesan).. నిర్మాణంలో రూపొందుతోన్న వెబ్‌సిరీస్ 'నవరస'(Navarasa). దీనికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇందులో సూర్య(Suriya)తో పాటు అరవింద స్వామి, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, రేవతి, నిత్యా మేనన్, పార్వతి, ఐశ్వర్య రాజేశ్, పూర్ణ, ప్రసన్న, సింహా, గౌతమ్ కార్తిక్, అశోక్ సెల్వన్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు. ఆగస్టు 6 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇందులోని 'తూరిగా' పాటను విడుదల చేశారు.
-
Feel the love 💕 with #Thooriga
— BARaju's Team (@baraju_SuperHit) July 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
A @Suriya_offl - @menongautham - @singer_karthik @madhankarky Special
▶️ https://t.co/vhSsr0GueN#GuitarKambiMeleNindru @Netflix_INSouth #ManiSir @JayendrasPOV#PrayagaMartin @aditi1231 @APIFilms @Wideanglecr @thinkmusicindia#Navarasa pic.twitter.com/o2a6q5DzdG
">Feel the love 💕 with #Thooriga
— BARaju's Team (@baraju_SuperHit) July 12, 2021
A @Suriya_offl - @menongautham - @singer_karthik @madhankarky Special
▶️ https://t.co/vhSsr0GueN#GuitarKambiMeleNindru @Netflix_INSouth #ManiSir @JayendrasPOV#PrayagaMartin @aditi1231 @APIFilms @Wideanglecr @thinkmusicindia#Navarasa pic.twitter.com/o2a6q5DzdGFeel the love 💕 with #Thooriga
— BARaju's Team (@baraju_SuperHit) July 12, 2021
A @Suriya_offl - @menongautham - @singer_karthik @madhankarky Special
▶️ https://t.co/vhSsr0GueN#GuitarKambiMeleNindru @Netflix_INSouth #ManiSir @JayendrasPOV#PrayagaMartin @aditi1231 @APIFilms @Wideanglecr @thinkmusicindia#Navarasa pic.twitter.com/o2a6q5DzdG
ఇదీ చూడండి.. Navarasa: 'నవరసా'ల టీజర్ వచ్చేసింది