సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిన్నటి కంటే మెరుగ్గా ఉందని అపో ఆస్పత్రి వెల్లడించింది. ఆయనకు ఈరోజు మరిన్ని వైద్యపరీక్షలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రజనీ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీకాంత్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. రక్తపోటు హెచ్చతగ్గులకు సంబంధించి వైద్యులు ఎప్పటికప్పుడు తలైవా ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. సాయంత్రం వైద్య పరీక్షల నివేదికలు వస్తాయని, రక్తపోటు నియంత్రణలోకి వచ్చాక డిశ్చార్జీ విషయాన్ని వెల్లడిస్తామని తెలిపింది.
రజనీకాంత్‌ను చూసేందుకు సందర్శకులెవరికి అనుమతిలేదని అపోలో ఆస్పత్రి సూచించింది. ఆయన ఆరోగ్యంపై తెలుగు రాష్ట్రాల్లో సహా చెన్నైలోనూ ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సూపర్‌స్టార్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నామని అపోలో ఆస్పత్రి సీఎండీ సంగీతారెడ్డి తెలిపారు. రజనీ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన బాగానే ఉన్నారని సంగీతారెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్