ETV Bharat / sitara

Annaatthe Song: ఎస్పీ బాలు ఆలపించిన చివరి పాట ఇదేనా? - Keerthy Suresh News

సూపర్​స్టార్​ రజనీకాంత్​ నటించిన 'అన్నాత్తే'(Rajinikanth Annaatthe) సినిమాలోని తొలి లిరికల్​ సాంగ్​(Annaatthe Song) విడుదలకు సిద్ధమైంది. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతాన్ని అక్టోబరు 4న(Annaatthe First Single Release Date) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే బాలు ఆలపించిన చివరి సినిమా పాట ఇదేనేమో అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

RajiniKanth's Annaatthe Movie first single sung by SPB to be out on October 4
Annaatthe Song: ఎస్పీ బాలు ఆలపించిన చివరి పాట ఇదేనా?
author img

By

Published : Oct 1, 2021, 10:01 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్ ప్రధానపాత్రలో 'శౌర్యం' ఫేమ్ శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అన్నాత్తే'​(Rajinikanth Annaatthe). ఇటీవలే ఈ సినిమాలోని విడుదలైన మోషన్​ పోస్టర్​కు సోషల్​మీడియాలో విపరీతమైన ఆదరణ దక్కుతోంది. రాయల్ ఎన్​ఫీల్డ్​ డ్రైవ్ చేస్తున్న తలైవా లుక్​ అభిమానులకు తెగ నచ్చేసింది. దీపావళి కానుకగా నవంబరు 4న(Annaatthe Release Date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని తొలి పాటను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది.

దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటను అక్టోబరు 4న(Annaatthe First Single Release Date) సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో రజనీకాంత్​తో పాటు ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్(Keerthy Suresh News) హీరోయిన్లుగా చేస్తున్నారు. డి.ఇమాన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. సన్​టీవీ కళానిధి మారన్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి.. Cinema News: 'అన్నాత్తే' మోషన్​ పోస్టర్.. నితిన్ మాస్ లుక్​లో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.