'దర్బార్' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పుడు 'అన్నాత్తె' సినిమాతో సందడి చేసేందుకు సిద్దమవుతున్నారు. దీంతో మరోసారి తలైవా వెండితెరపై బ్లాక్బాస్టర్ అందిస్తారని అబిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా కథ ఆన్లైన్లో లీక్ అయినట్లు తెలుస్తోంది.
చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రల పేర్లతో కూడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై చిత్రబృందం అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. 'వీర', 'విశ్వాసం' వంటి సూపర్ హిట్ చిత్రాలనందించిన దర్శకుడు శివ.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మీనా, ఖుష్బు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ప్రకాశ్‌రాజ్, సూరి, సతీశ్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌కు సంబంధించిన తొలి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తిచేసుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">