ETV Bharat / sitara

అడవిలో సూపర్​స్టార్ రజనీ సాహసాలు! - Rajinikanth On 'Man Vs Wild' promo

'మ్యాన్ వర్సెస్ వైల్డ్'​ కార్యక్రమంలో రజనీకాంత్​ పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమో నేడు విడుదలైంది. ఇందులో బేర్ గ్రిల్స్​తో కలిసి కొండలు ఎక్కుతూ, నీటిలో ఈదుతూ కనిపించాడు తలైవా.

రజనీకాంత్ మ్యాన్​ వర్సెస్​ వైల్డ్
సూపర్​స్టార్ రజనీకాంత్
author img

By

Published : Mar 9, 2020, 2:02 PM IST

డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లో సూపర్‌స్టార్ రజనీకాంత్ సందడి చేయబోతున్నాడు. బేర్ గ్రిల్స్‌తో కలిసి అటవీప్రాంతంలో తిరిగాడు. ఈ కార్యక్రమం షూటింగ్‌ కోసం బేర్ కర్ణాటక వచ్చాడు. కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చిత్రీకరణ జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు. ఇందులో రజనీ కొండలు ఎక్కుతూ, నీటిలో ఈదుతూ.. సాహసాలు చేస్తూ కనిపించాడు. 'ఇది నిజమైన సాహసం..' అంటూ తన ఫీలింగ్‌ చెప్పుకొచ్చాడు.

సూపర్‌స్టార్‌ ఉత్సాహం చూసి బేర్‌ గ్రిల్స్‌ ప్రశంసించాడు. తలైవాతో కలిసి పనిచేయడం గురించి ఆయన ట్వీట్‌ చేశాడు. రజనీకాంత్‌ ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటారని, ప్రతి ఛాలెంజ్‌ను గొప్పగా స్వీకరించారని అన్నాడు. ఆయనపై గౌరవం మరింత పెరిగిందని చెప్పాడు. ఈనెల 23న రాత్రి 8 గంటలకు ఈ షో ప్రసారం కాబోతోంది. '

'మ్యాన్‌ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్.. అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ సాహసాలు చేస్తుంటాడు. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ కార్యక్రమంలో కనిపించారు

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.