ETV Bharat / sitara

హైదరాబాద్​కు రజనీకాంత్.. తెలుగులోకి మరో మలయాళ సినిమా

author img

By

Published : Dec 13, 2020, 4:07 PM IST

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో రజనీకాంత్ 'అన్నాత్త', రామ్ 'రెడ్', రవితేజ 'క్రాక్', ఓటీటీలో 'మాయనది' చిత్రాల విశేషాలు ఉన్నాయి.

rajinikanth leaves to hyderabad for Annaatthe shoot.. mayanadhi telugu dubbed version in aha ott
హైదరాబాద్​కు రజనీకాంత్.. తెలుగులోకి మరో మలయాళ సినిమా

>సూపర్​స్టార్ రజనీకాంత్.. 'అన్నాత్త' షూటింగ్​ కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు వచ్చారు. ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ దర్శకుడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

శనివారం(డిసెంబరు 12) 71వ పుట్టినరోజు జరుపుకొన్న రజనీ.. త్వరలోనే తన రాజకీయ అరంగేట్రంపైనా ప్రకటన చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో అభిమానులందరిలోనూ ఆసక్తి మొదలైంది.

>రామ్​ 'రెడ్' నుంచి 'కౌన్ హై లుచ్చా కౌన్ హై అచ్చా' అంటూ సాగే మాస్ గీతం విడుదలైంది. మణిశర్మ సంగీతమందించారు. తమిళ సినిమా 'తడమ్'కు రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. మాళవిక, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. కిశోర్ తిరుమల దర్శకుడు. సంక్రాంతికి థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

>'క్రాక్'లోని 'భలే తగిలావే బంగారం' గీతం ప్రోమో విడుదలైంది. తమన్ సారథ్యంలో అనిరుధ్ పాడిన పూర్తి పాట.. సోమవారం(డిసెంబరు 14) ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ ఇందులో పోలీస్​గా కనిపించనున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్. సంక్రాంతికే ఈ చిత్రం కూడా థియేటర్లలోకి రానుంది.

>మలయాళ సినిమాల డబ్బింగ్ వెర్షన్లను విడుదల చేస్తున్న ఆహా ఓటీటీ.. 'మాయనది' చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్​ చేయనున్నారు. టొవినో థామస్, ఐశ్వర్య లక్ష్మి హీరోహీరోయిన్లు.

rajinikanth leaves to hyderabad for Annaatthe shoot
ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు వచ్చిన రజనీకాంత్
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

mayanadhi telugu dubbed version in aha ott
మాయనది సినిమా పోస్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.