Rajendra prasad ott movie: కిరిటీ రాజేంద్రప్రసాద్ కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. 'ఆహా'లో ఇది త్వరలో స్ట్రీమింగ్ కానుంది. 'సేనాపతి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సినిమా ఇండస్ట్రీలో రాజేంద్రప్రసాద్ 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'సేనాపతి' సినిమాను ప్రకటించడం సహా ఆదివారం ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో భాగంగా మన అందరికీ తెలిసిన ఏడు చేపల కథను చెప్పిన రాజేంద్రప్రసాద్.. సినిమాపై ఆసక్తిని పెంచారు.
Hanu man movie: తేజ-ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'హను-మాన్'. ఈ సినిమాలోని మీనాక్షి పాత్రను.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. సోమవారం ఉదయం 10:35 గంటలకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని పోస్టర్ విడుదల చేసి, ప్రకటించారు.
సూపర్‌హీరో కథతో తీస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.
Nani shyam singha roy: నాని 'శ్యామ్‌సింగరాయ్' డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే వరంగల్‌లో డిసెంబరు 14న రాయల్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
కోల్‌కతా నేపథ్య కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు.
*సీనియర్ నటులు సాయికుమార్, రాధిక కూడా ఓటీటీలో నేరుగా సినిమా చేస్తున్నారు. 'గాలివాన' టైటిల్‌తో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ సినిమా జీ5లో కొన్నాళ్ల తర్వాత విడుదల కానుంది. పూర్తి వివరాలు కొన్నిరోజుల్లో వెల్లడించే అవకాశముంది.
*తమిళ హీరో విజయ్ ఆంటోని 'విక్రమ్ రాథోడ్' రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. కానీ ఎలాంటి తేదీ వెల్లడించలేదు. ఇందులో విజయ్ పోలీస్‌గా నటించడం విశేషం. మాస్ట్రో ఇళయరాజా సంగీతమందించగా.. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి: