ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 8న విడుదల చేస్తున్నట్టు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. 2021 సంక్రాంతికి రాజమౌళి ముందుగానే కర్చీఫ్ వేసుకున్నారన్నమాట. రాజమౌళి సినిమా వస్తుందంటే, ఆ సీజన్‌లో మిగిలిన చిత్రాలకు అంతగా స్థానం లేనట్టే. సంక్రాంతికి రావాలని నిర్ణయించుకున్న కొన్ని చిత్రాలు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సీజన్‌లో శంకర్ సినిమా వస్తోంది. కమల్‌హాసన్ హీరోగా రూపొందిస్తున్న 'భారతీయుడు 2'ని సంక్రాంతి బరిలో నిలిపాడు శంకర్. జనవరి 14న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.
దర్శకులుగా రాజమౌళి, శంకర్‌ల స్థాయి తెలియంది కాదు. వీళ్ల సినిమా అంటే బాక్సాఫీసు హోరెత్తిపోతుంది. థియేటర్లన్నీ నిండిపోతాయి. వీరి సినిమాలు వారం రోజుల వ్యవధిలో వస్తుండటంతో థియేటర్లు కళకళలాడనున్నాయి. మిగిలిన సినిమాల మాటెలా ఉన్నా, ఈ రెండు చిత్రాలపైనే పరిశ్రమ దృష్టి ఉంటుంది. ఈ రెండూ పాన్ ఇండియా చిత్రాలు. ఈ సినిమాల మధ్య జరిగే పోటీ ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదీ చూడండి.. విజయ్ 'బిగిల్' టీమ్‌పై ఐటీ గురి- 65కోట్లు సీజ్