ETV Bharat / sitara

అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది: మేఘ - రాజ రాజ చోర మూవీ రిలీజ్​

శ్రీవిష్ణు, మేఘ జంటగా నటించిన చిత్రం 'రాజ రాజ చోర'. హితేశ్‌ గోలి తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది మేఘ.

raja raja chora movie
రాజ రాజ చోర మూవీ
author img

By

Published : Aug 14, 2021, 7:05 AM IST

"మొదట్లో నాకు తగ్గట్లుగా ఉండే ఇలాంటి పాత్రలే చేయాలని కొన్ని పరిమితులుండేవి. ఇప్పుడా కంఫర్ట్‌ జోన్‌ నుంచి పూర్తిగా బయటకొచ్చా. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రయోగాలు చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా" అంటోంది నటి మేఘా ఆకాష్‌. ఇప్పుడామె శ్రీవిష్ణుతో కలిసి నటించిన చిత్రం 'రాజ రాజ చోర'. హితేశ్‌ గోలి తెరకెక్కించారు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. ఈనెల 19న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది మేఘ.

"లాక్‌డౌన్‌లో ఈ కథ విన్నా. హితేశ్‌ స్క్రిప్ట్‌ వినిపించినప్పుడే చాలా నచ్చేసింది. నేనిప్పటి వరకు ఇలాంటి భిన్నమైన కథ వినలేదు. ఇంతటి విభిన్నమైన పాత్రని పోషించలేదు. నేనిందులో సంజన అనే యువతిగా కనిపిస్తా. ఇష్టమైన దాని కోసం ఎంతైనా కష్టపడే బలమైన అమ్మాయి తను. ఇది ఓ హీరో చుట్టూనో.. లేదంటే హీరోయిన్‌ చుట్టూనే తిరిగే కథ కాదు. కథలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యముంటుంది."

"సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. తెరపై కనిపించే ప్రతి పాత్రలోనూ ఓ కామిక్‌ టచ్‌ ఉంటుంది. హితేశ్‌ కొత్త దర్శకుడైనా ఏమాత్రం భయం అనిపించలేదు. నాకు తెలిసి నేనింత వరకు శ్రీవిష్ణు అంత సైలెంట్‌ పర్సన్‌ని ఎప్పుడూ చూడలేదు. ఆయన చాలా సిగ్గరి. నేనూ అంతే. అయితే ఆయనను చూశాక.. తన కన్నా నేను చాలా బెటర్‌ అనిపించింది."

"తెలుగు సినిమాల నుంచి నేనేం కావాలని గ్యాప్‌ తీసుకోలేదు. మంచి స్క్రిప్ట్‌లు దొరకలేదంతే. ఈలోపు తమిళం నుంచి మంచి కథలు రావడం వల్ల అక్కడ వరుస సినిమాలు చేశా. ఈ ఏడాది తెలుగు నుంచి మంచి స్క్రిప్ట్‌లు వస్తున్నాయి. ఇప్పుడిక్కడా వరుస చిత్రాలు చేస్తున్నా. ప్రస్తుతం తెలుగులో 'డియర్‌ మేఘ', 'గుర్తుందా శీతాకాలం', 'మను చరిత్ర' చిత్రాలు చేస్తున్నా".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:'ఫైటర్' విడుదల తేదీ.. క్రేజీ అంకుల్స్ ప్రీ రిలీజ్ వేడుక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.