ETV Bharat / sitara

'శిల్పాశెట్టి దూరం పెట్టడం వల్లే రాజ్​ కుంద్రా అలా' - Gahana rajkundra porn case

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అశ్లీల కథా చిత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. కొన్నేళ్లనుంచి వంచనకు గురైన బాధితులు.. రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో బయటికి వచ్చి పోలీసులతో తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. బాలీవుడ్‌ అవకాశాల పేరుతో బలవంతంగా ఫోర్న్‌ వీడియోలు షూట్‌ చేశాడని ఒకరంటే.. భార్యతో సంబంధాలు సంక్లిష్టంగా మారాయంటూ లైంగిక దాడికి పాల్పడినట్లు మరొకరు ఆరోపించారు.

Raj kundra porn video allegations case full story
'శిల్పాశెట్టి దూరం పెట్టడం వల్లే రాజ్​ కుంద్రా అలా'
author img

By

Published : Jul 29, 2021, 1:50 PM IST

Updated : Jul 29, 2021, 3:24 PM IST

అశ్లీల చిత్రాల కేసులో ప్రధాన నిందితుడు, బాలీవుడ్‌ నటి భర్త రాజ్‌కుంద్రా అశ్లీల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజ్‌కుంద్రా ఈనెల 19న అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉండగా బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమగోడు వెల్లబోసుకుంటున్నారు. రాజ్‌కుంద్రా తమను ఎలా వంచించాడో పోలీసులకు చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు. కుంద్రా కొందరిపై లైంగికదాడికి కూడా పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉండి అవకాశాలు లేనివారికి డబ్బు ఆశ చూపిన రాజ్‌కుంద్రా.. మరికొందరికి బాలీవుడ్‌లో అవకాశాలను ఎరగా వేసినట్లు తెలుస్తోంది.

లైంగిక దాడికి పాల్పడినట్లు

నటి షెర్లిన్‌ చోప్రా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కుంద్రాపై పలు ఆరోపణలు చేసింది. ఈ కేసులో పోలీసుల నుంచి సమన్లు అందుకున్న ఆమె.. ఈనెల 27న వాంగ్మూలం ఇచ్చింది. తనతో రాజ్‌కుంద్రా ప్రవర్తించిన తీరును పుసగుచ్చినట్లు వివరించింది. 2019 ప్రథమార్థంలో 'ది షెర్లిన్‌ చోప్రా యాప్‌' పేరుతో తన మేనేజర్‌కు ఫోన్‌ చేసిన రాజ్‌కుంద్రా.. సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసే కంటెంట్‌ ఉచితమని, అదే కస్టమరైజ్డ్‌ యాప్‌ ద్వారా అయితే డబ్బు వస్తుందని ఆశచూపినట్లు ఆమె పేర్కొంది. ఆ సమావేశం తర్వాత ఒకసారి తన నివాసానికి వచ్చిన అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించింది. అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ముద్దుపెట్టినట్లు వాపోయింది. భార్య శిల్పాశెట్టితో తన సంబంధం సంక్లిష్టంగా మారినట్లు చెప్పాడని, అదే విషయాన్ని చాలాసార్లు నొక్కి చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. ఒకానొక దశలో రాజ్‌కుంద్రా తీరు చూసి భయపడిపోయిన తాను.. అక్కడే ఆగిపోవాలని సూచించినట్లు చెప్పింది. చివరికి ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లి దాకున్నట్లు వాపోయింది.

Raj kundra porn video allegations case full story
షెర్లిన్​ చోప్రా

బలవంతంగా పోర్న్​ వీడియోలు

అశ్లీలవీడియోల 'హాట్‌షాట్స్‌' యాప్‌ కోసం తనతో బలవంతంగా పోర్న్‌ వీడియోలు షూట్‌ చేశారని బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నటి గహనా వశిష్ఠ్‌తో పాటు రాజ్‌కుంద్రా సంస్థకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలతో ఫిబ్రవరిలో గహనా వశిష్ఠ్‌ సహా 10 మందిని ముంబయి నేరవిభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ముంబయి నేర విభాగం పోలీసులకు రోజుకో అశ్లీల కథాచిత్రం బయటపడుతోంది. రాజ్‌కుంద్రా అశ్లీల బాగోతం సీరియల్‌లా సాగేలా కనిపిస్తోంది.

ఇవీ చూడండి:

Last Updated : Jul 29, 2021, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.