ఇటీవల బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షో 'బిగ్‌బాస్ సీజన్ 3'. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మొత్తం 17మంది సభ్యులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. చివరి వరకూ నటి, యాంకర్ శ్రీముఖి అతడికి గట్టిపోటీ ఇచ్చింది. హౌస్లో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. మంచి స్నేహితులుగా ఉన్న వీరు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు.
తాజాగా రాహుల్, శ్రీముఖి కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇరువురు తమ ఇన్‌స్టాలో ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ, "గతం గతః.. అసలు రిలేషన్‌షిప్ ఇప్పుడు మొదలైంది" అంటూ అభిమానులతో పంచుకున్నారు. పాత గొడవలు మర్చిపోయి మళ్లీ స్నేహితులుగా మారినందుకు నెటిజన్లు సంతోషిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"బిగ్‌బాస్ సీజన్ 3"తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. రాహుల్.. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగమార్తండ' లో నటుడిగా అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ గాయకుడిగా తన సత్తా చాటిన రాహుల్.. నటుడిగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు.
ఇదీ చూడండి: వద్దన్న రామ్గోపాల్ వర్మే.. హీరోగా అవకాశమిచ్చాడు