రాజీవ్ గాంధీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న నలినీ మురగన్ జీవితాల ఆధారంగా తెరకెకిస్తున్న చిత్రంలో మురగన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె తెలిపారు. డిసెంబర్ నుంచి ఆ సినిమా చిత్రీకరణ మొదలుకానున్నట్లు స్పష్టం చేసిన రఘు కుంచె.. 'పలాస' చిత్రం తర్వాత నటుడిగా కూడా తీరిక లేకుండా గడుపుతున్నట్లు వెల్లడించారు.
ఈ లాక్డౌన్లో నాలుగు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌ల్లో అవకాశాలు వచ్చాయని ఈటీవీ భారత్‌కు వివరించారు రఘుకుంచె. అలాగే తన ప్రతి సినిమాకు ఒక కొత్త గాయకున్ని పరిచయం చేస్తానని పేర్కొన్నారు. ఈటీవీ వల్లే తన ప్రత్యేక గీతాలకు మరింత గుర్తింపు వచ్చిందన్నారు. పాట విని సినిమాకు వెళ్లడం కాకుండా పాట ప్రేక్షకుడ్ని సినిమాకు తీసుకెళ్లాలంటున్న రఘు కుంచె.. తన సంగీత ప్రయాణంలోని అనుభవాలను ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.