ETV Bharat / sitara

ఇది లవ్​లెటర్స్​ టైమ్.. 'రాధేశ్యామ్​' రిలీజ్​పై డైరెక్టర్​ క్లారిటీ - రాధాకృష్ణ కుమార్

Radhe Shyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్' సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'ఆర్​ఆర్​ఆర్'​ వాయిదా పడిన నేపథ్యంలో 'రాధేశ్యామ్​' విడుదల తేదీపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై స్పష్టతనిచ్చారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

Radhe Shyam
రాధేశ్యామ్
author img

By

Published : Jan 2, 2022, 4:18 PM IST

Radhe Shyam: డార్లింగ్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఇటీవలే 'ఆర్​ఆర్​ఆర్'​ వాయిదా పడిన నేపథ్యంలో 'రాధేశ్యామ్' విడుదలపైనా అనుమానాలు నెలకొన్నాయి. అయితే నూతన సంవత్సరం కానుకగా విడుదల చేసిన పోస్టర్​లోనూ విడుదల తేదీ జనవరి 14 అనే ఉంది. దీంతో ఫ్యాన్స్​లో కొంత ఉపశమనం కలిగినా.. మరికొందరిలో అనుమానం అలాగే ఉంది. ఈ క్రమంలోనే రిలీజ్​ డేట్​పై మరోసారి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

Radhe Shyam
'రాధేశ్యామ్'

జనవరి 2న ఓ అభిమాని పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్​లో శుభాకాంక్షలు తెలిపారు రాధాకృష్ణ. దానికి మరో ఫ్యాన్​ రిప్లై ఇస్తూ.. "సినిమాను ప్రీ పోన్ చేస్తున్నారా? పోస్ట్​పోన్ చేస్తున్నారా? స్పష్టత ఇవ్వండి.. లేదంటే ఓ లేడీ ఫ్యాన్.. 'మరోసారి సూసైడ్​ లెటర్​ రాస్తుంది.. అసలే ఆమె ప్రెగ్నెంట్'​" అంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన రాధాకృష్ణ.. "ఇట్స్​ టైమ్​ ఫర్​ లవ్​ లెటర్స్​, నాట్ సూసైడ్​ లెటర్స్ (ఇది ప్రేమలేఖల సమయం.. సూసైడ్​ లేఖలది కాదు)" అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో అనుకున్న తేదీకే 'రాధేశ్యామ్' రానుందని మరోసారి స్పష్టమైంది.

Radhe Shyam
రాధాకృష్ణ కుమార్ ట్వీట్

ఇదీ చూడండి: సంక్రాంతికి సినిమాలే సినిమాలు.. కాకపోతే 'చిన్న' ట్విస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.