ETV Bharat / sitara

నటుడు మాధవన్​ను వరించిన డాక్టరేట్ - మాధవన్​ న్యూస్

అద్భుత పాత్రలతో మెప్పించి, ప్రేక్షకుల్ని అలరించినందుకు ప్రముఖ నటుడు మాధవన్​ కొల్హాపుర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ విషయాన్ని ఇన్​స్టాలోనూ పంచుకున్నారు.

R Madhavan receives honour for contribution to arts, cinema
ప్రముఖ నటుడు మాధవన్​కు సత్కారం
author img

By

Published : Feb 18, 2021, 9:22 AM IST

Updated : Feb 18, 2021, 10:18 AM IST

ప్రముఖ నటుడు మాధవన్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆర్ట్స్, సినిమాల్లో చూపిన ప్రతిభకుగానూ డీవై పాటిల్ ఎడ్యకేషన్​ సొసైటీ, కొల్హాపుర్.. బుధవారం ఈ పురస్కారం ఆయనకు అందజేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న మాధవన్ ఆనందం వ్యక్తం చేశారు.

R Madhavan receives honour for contribution to arts, cinema
డిగ్రీ అందుకుంటున్న మాధవన్

"ఈ సత్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. సరికొత్త ప్రాజెక్టులు, వినూత్న పాత్రల్ని ఎంపిక చేసుకోవడంలో ఈ డాక్టరేట్ నాకు తోడ్పాటును అందిస్తుందని అనుకుంటున్నాను" -ఇన్​స్టాలో మాధవన్

90ల్లో వచ్చిన మణిరత్నం 'అలైపాయతే'(తెలుగులో 'సఖి') సినిమాతో మాధవన్​ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి పేరు సంపాదించారు.

2018లో వచ్చిన 'బ్రీత్' వెబ్ సిరీస్​తో డిజిటల్ తెరంగేట్రం చేశారు. ఇటీవల 'మారా'తో ప్రేక్షకుల్ని పలకరించారు. దుల్కర్​ సల్మాన్​ 'చార్లీ' సినిమాకు రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. ప్రస్తుతం తొలిసారి దర్శకుడిగా 'రాకెట్రీ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు.

Last Updated : Feb 18, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.