ETV Bharat / sitara

'పుష్ప'రాజ్​ షూటింగ్​కి వచ్చే వేళాయే! - పుష్ప సినిమా వార్తలు

కరోనా కారణంగా ఆగిపోయిన 'పుష్ప' చిత్రీకరణ త్వరలోనే పునఃప్రారంభం కానుంది. కేరళ అడవుల్లో నవంబరు మొదటి వారం నుంచి జరగనున్న షూటింగ్​లో అల్లు అర్జున్​ అడుగుపెట్టనున్నాడు.

Pushpa Shooting to resumes from November in Kerala Forest
'పుష్ప'రాజ్​ షూటింగ్​కి వచ్చే వేళాయే!
author img

By

Published : Sep 24, 2020, 8:06 AM IST

స్టైలిష్​స్టార్​ అల్లు అర్జున్‌ 'పుష్ప' చిత్రం కోసం రంగంలోకి దిగనున్నాడు. సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ.. పుష్పరాజ్‌ అనే పాత్రలో దర్శనమివ్వబోతున్నాడు. పూర్తి అటవీ నేపథ్యంగా తెరకెక్కబోతుంది. షూటింగ్​ కోసం కేరళ అడవుల్లోకి ప్రయాణం కాబోతుంది 'పుష్ప' బృందం.

Pushpa Shooting to resumes from November in Kerala Forest
'పుష్ప' సినిమా ఫస్ట్​లుక్​

నిజానికి ఈ ఫిబ్రవరిలోనే కేరళ అడవుల్లో బన్నీ లేకుండా ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేశారు. సరిగ్గా అల్లు అర్జున్‌ సెట్లోకి అడుగుపెట్టాల్సిన సమయంలోనే కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితులతో షూటింగ్‌ నిలిచిపోయింది. దీంతో మిగిలిన చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని అడవుల్లోనే పూర్తి చేస్తారని వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా చిత్రీకరణలకు అనుమతులు లభించడం వల్ల.. మళ్లీ కేరళ అడవుల్లోకే ప్రయాణమవుతోంది చిత్ర బృందం. అక్కడే నవంబరు తొలి వారం నుంచి కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ చిత్రం కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు అల్లు అర్జున్‌. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా పూర్తి మాస్‌ అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. తొలిసారి చిత్తూరు యాసలో సంభాషణలు పలకబోతున్నాడు. ఇతడికి జోడీగా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.