స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా రెండు కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో చిత్రీకరణ సజావుగా సాగినట్లు వెల్లడించింది. ఈ షూటింగ్‌కు ఎంతగానో సహకరించిన అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది.
-
#Pushpa Shoot Update 🙂#PushpaOnAug13 @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie
— Mythri Movie Makers (@MythriOfficial) February 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/LU6fw0p8Bo
">#Pushpa Shoot Update 🙂#PushpaOnAug13 @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie
— Mythri Movie Makers (@MythriOfficial) February 6, 2021
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/LU6fw0p8Bo#Pushpa Shoot Update 🙂#PushpaOnAug13 @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie
— Mythri Movie Makers (@MythriOfficial) February 6, 2021
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/LU6fw0p8Bo
"రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో 'పుష్ప' చిత్రం రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అక్కడి ప్రజలు, పాలకవర్గానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సహకారం లేకపోతే షూటింగ్ ఇంత సజావుగా జరిగేది కాదు."
-పుష్ప టీమ్
'ఆర్య', 'ఆర్య-2' తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్ చిత్రం కావడం వల్ల 'పుష్ప'పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది.