ETV Bharat / sitara

మిలియన్ డాలర్​ క్లబ్​లో 'పుష్ప'.. పార్ట్​-2 షూటింగ్ అప్పుడే - pushpa first day collection

Pushpa collection: 'పుష్ప' చిత్రానికి సంబంధించిన కొత్త విశేషాలు వచ్చేశాయి. పార్ట్-2 షూటింగ్, యూఎస్​ కలెక్షన్లు, సక్సెస్​ మీట్​ గురించి ఈ స్టోరీలో ఉన్నాయి.

pushpa 2 movie
అల్లు అర్జున్ పుష్ప
author img

By

Published : Dec 18, 2021, 8:54 PM IST

Allu arjun pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సందడి అస్సలు తగ్గట్లేదు. థియేటర్​ల్లో, సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'పుష్ప' రెండో భాగం గురించి ఆసక్తికర విషయాలను నిర్మాత నవీన్ వెల్లడించారు.

'పుష్ప' పార్ట్-2 షూటింగ్​ ఫిబ్రవరి-మార్చిలో ప్రారంభమవుతుందని నిర్మాతల్లో ఒకరైన నవీన్ యర్నేని చెప్పారు. తొలి భాగం కంటే మరింత బాగా సినిమాను రూపొందించి పాన్ ఇండియా స్టైల్​లో రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ విడుదల తమకు ముఖ్యమేనని అన్నారు.

pushpa movie
అల్లుఅర్జున్ పుష్ప మూవీ

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'పుష్ప' సక్సెస్​మీట్​ డిసెంబరు 20న తిరుపతిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల నేపథ్యంగానే తెరకెక్కించారు. అందుకే తిరుపతిలో ఈ ఈవెంట్​ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

మాస్ మసాలా ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన 'పుష్ప' సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.71 కోట్ల గ్రాస్​ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. '2021లో బిగ్గెస్​ ఫస్ట్​ డే గ్రాస్​' ఇది అని పేర్కొంది.

అలానే వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తునన్న 'పుష్ప'.. యూఎస్​లో మిలియన్ డాలర్ క్లబ్​లోనూ చేరింది. శనివారం ఉదయం ఈ మార్క్​ను అందుకుంది. ఈ వారాంతం పూర్తయిన తర్వాత కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.