ETV Bharat / sitara

పునీత్​కు ఓటీటీ సంస్థ నివాళి.. ఫ్రీగా ఐదు సినిమాలు చూసే ఛాన్స్ - పునీత్ రాజ్​కుమార్ డెత్

Puneeth rajkumar news latest: స్టార్ హీరో పునీత్​కు ఘనంగా నివాళి ఇచ్చేందుకు ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. పునీత్ నటించి, నిర్మించిన ఐదు సినిమాలను.. అభిమానులు ఉచితంగా చూసే అవకాశం కల్పించింది.

puneeth rajkumar
పునీత్ రాజ్​కుమార్
author img

By

Published : Jan 22, 2022, 10:17 AM IST

Puneeth rajkumar amazon prime: కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్​.. గతేడాది అక్టోబరు 19న గుండెపోటుతో మరణించారు. చిన్న వయసులోనే ఆయన తనువు చాలించడాన్ని అభిమానుల్ని తట్టుకోలేకపోయారు. కొన్నిరోజులపాటు ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయారు. సాధారణ ప్రజలతో పాటు స్టార్ సెలబ్రిటీల వరకు పునీత్​కు ఘనంగా నివాళి అర్పించారు.

ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్​ కూడా తనదైన రీతిలో నివాళి ఇచ్చేందుకు సిద్ధమైంది. పునీత్ నటించిన​ ఐదు సినిమాలను ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అభిమానులు, యాప్​లో ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. అలానే పునీత్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న మూడు కొత్త సినిమాలు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'వన్ కట్ టూ కట్', 'ఫ్యామిలీ ప్యాక్​' కూడా తమ ఓటీటీలోనే విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

puneeth rajkumar five movies
పునీత్ రాజ్​కుమార్ మూవీస్

2002లో 'అప్పు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పునీత్. అప్పటి నుంచి ఈ కథానాయకుడిని ఫ్యాన్స్ 'అప్పు' అని పిలవడం ప్రారంభించారు. అభి, వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, హుదుగురు, అంజనీపుత్ర తదితర సినిమాలతో హిట్లు కొట్టి అభిమానుల మనసుల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు.

పునీత్ ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. గతేడాది ఏప్రిల్​లో విడుదలైన 'యువరత్న' సినిమాలో చివరగా కనిపించారు. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై ఆదరణ దక్కించుకుంది. నటుడిగానే కాకుండా సింగర్​గాను అభిమానుల్ని అలరించారు పునీత్. గాయకుడిగా పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పునీత్​ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

puneeth rajkumar james movie
పునీత్ ​రాజ్ కుమార్ 'జేమ్స్' మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.