*ఇటీవల మరణించిన అగ్రకథానాయకుడు పునీత్ రాజ్‌కుమార్‌కు సంతాపం తెలియజేస్తూ 'పునీత్ గీత నామన' పేరుతో ఈ రోజు(నవంబరు 16) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పునీత్‌కు నివాళిగా మంగళవారం షూటింగ్‌లు, ఇతర కార్యకలాపాలన్నీ నిలిపివేశారు.
*మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ ఈవెంట్.. దాదాపు మూడు గంటలపాటు జరగనుంది.
*బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి శాండల్‌వుడ్ సెలబ్రిటీలతో పాటు తెలుగు హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్‌తో పాటు తమిళ కథానాయకుడు సూర్య తదితరులు హాజరు కానున్నారు.
*కరోనా ప్రభావం కారణంగా 'పునీత్ గీత నామన' కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరవుతారు.
*పునీత్ రాజ్‌కుమార్‌పై ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని ఈ ఈవెంట్లో ఆలపించనున్నారు.
*కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
*పునీత్‌రాజ్‌కుమార్..అక్టోబరు 29న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్చించుకోలేకపోతున్నారు.
ఇవీ చదవండి:
- పునీత్ ద్వాదశ దినకర్మ- 40 వేల మంది అభిమానులు హాజరు
- పునీత్‌ను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న సూర్య
- ఆ ఏనుగుకు కన్నడ పవర్ స్టార్ 'పునీత్' పేరు
- పునీత్‌కు పాటతో ఘనమైన నివాళి.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
- పునీత్ నేత్రదానంతో మరో 10మందికి కంటిచూపు!
- పునీత్ స్ఫూర్తితో.. నేత్రదానం కోసం 400 మంది దరఖాస్తు
- 'పవర్‌స్టార్ పునీత్‌కు పద్మశ్రీ ఇవ్వాల్సిందే!'
- హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
- పునీత్ చివరి సినిమా.. ఆయన జయంతికి రిలీజ్..!
- ఆ బాధ్యత స్వీకరిస్తానని పునీత్‌కు మాటిస్తున్నా: విశాల్