ETV Bharat / sitara

'పునర్నవికి నిశ్చితార్థం అయింది నిజమే.. కానీ!' - కమిట్ మెంటల్

పునర్నవికి నిశ్చితార్థం అయిందంటూ వస్తోన్న కామెంట్లకు చెక్​ పడింది. తను ప్రస్తుతం నటిస్తోన్న వెబ్​ సిరీస్​లో భాగంగా నిశ్చితార్థం అయినట్లు స్పష్టం చేసింది సంబంధిత చిత్ర యూనిట్​. 'కమిట్​ మెంటల్​'గా వస్తోన్న ఈ వెబ్​ సిరీస్​ నవంబర్​ 13న ఆహా వేదికగా విడుదలకానుంది.

Punarnavi_engagement
'పునర్నవికి నిశ్చితార్థం అయింది నిజమే కానీ ..!'
author img

By

Published : Oct 30, 2020, 2:45 PM IST

ఎట్టకేలకు తన నిశ్చితార్థం విషయాన్ని బయటపెట్టింది నటి పునర్నవి. ఆహా ఓటీటీ వేదికగా రానున్న 'కమిట్​ మెంటల్'​ వెబ్​ సిరీస్​లో నటిస్తున్నట్లు స్పష్టం చేసింది. నిశ్చితార్థం అయిన మాట నిజమే కానీ అను, ఫనీకి అంటూ సంబంధిత వెబ్​ సిరీస్​ ఫస్ట్​ లుక్​ను రిలీజ్​ చేశాడు నటుడు శ్రీ విష్ణు.

ఇంతకుముందు ఇన్​స్టా వేదికగా నిశ్చితార్థం అయినట్లు ఫొటోలు పెట్టి అభిమానులను కలవరపెట్టిన పునర్నవి.. 'ఎట్టకేలకు ఇది జరుగుతోంది' అనే కామెంట్​తో తన పెళ్లి ఖరారైనట్లే నమ్మించింది. కానీ, ఈ నిశ్చితార్థం నిజమైందని కాదని తెలిసిన తర్వాత నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఈ వెబ్​ సిరీస్​ ఆహా వేదికగా నవంబర్​ 13న విడుదల అవుతుందని చిత్ర యూనిట్​ పేర్కొంది. క్రేజీ కపుల్​ క్రేజీ కథను విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఫస్ట్​లుక్​ పై హర్షం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:పవన్​ కల్యాణ్ సరసన సాయి పల్లవి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.