'ఉయ్యాల జంపాల' ఫేం పునర్నవి.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటోలు నెటిజన్లకు ఆసక్తి, ఆశ్చర్యం, అనుమానం కలిగిస్తున్నాయి. ఈ ఫొటోలో ఆమె చేతిని మరొకరు పట్టుకుని ఉన్నారు. ఇంకో విశేషమేమిటంటే ఆమె చేతికి ఉన్న రింగ్ నిశ్చితార్థ ఉంగరంలా ఉంది. దీంతో మొత్తానికి జరగబోతుందని వ్యాఖ్య రాసుకొచ్చిందీ భామ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
దీంతో కొంతమంది నెటిజన్లు తనకు పెళ్లి ఖరారైనట్లు భావించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొంతమంది ఆ చేయి ఎవరిది అయి ఉంటుందా ఆని ఆసక్తిగా ఆలోచిస్తున్నారు?.. మిగతా వారు నిజంగా ఆమెకు నిశ్చితార్థం అయిపోయిందా? లేదంటే తాను నటించే ఏదైనా సినిమా లేదా వెబ్‌సిరీస్‌లో సన్నివేశమా అంటూ అనుమాన పడుతున్నారు. మరి ఏది నిజమే తెలియాలంటే పునర్నవి నోరు విప్పాల్సిందే.
కాగా, సింగర్ రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి మధ్య ప్రేమాయణం నడిచిందని అప్పట్లో వార్తలొచ్చాయి. పలు ఇంటర్వ్యూల్లో వీరిద్దరికీ ఇదే ప్రశ్న ఎదురైంది. కానీ ఇద్దరూ అలాంటిదేమీ లేదని, తాము స్నేహితులమని చెబుతూ వచ్చారు.
ఇది చూడండి దీపావళికి ఆహా వేదికగా 'అనగనగా ఓ అతిథి'