దేశమంతా ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవితాలను తెరకెక్కించాలని కొందరు నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి భాజాపా సీనియర్ నేత, స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయీ చేరారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా.. 'ది అన్‌టోల్డ్ వాజ్‌పేయీ' పుస్తకం ఆధారంగా రూపొందించనున్నారు. ఇప్పటికే దానిపై హక్కుల్ని సొంతం చేసుకున్నారు శివశర్మ-జీషన్ అహ్మద్.
ప్రముఖ రచయిత ఉల్లేఖ్ ఎన్.పి రచించిన ఈ పుస్తకంలో వాజ్‌పేయీ.. చిన్నతనం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వరకు జరిగిన సంఘటనలు పొందుపరిచి ఉన్నాయి. ఆయన జీవితాన్ని అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన శివశర్మ చెప్పారు.
"వాజ్‌పేయీ జీవితాన్ని వెండితెరపైకి తీసుకురావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మనలో చాలామందికి ఆయన గురించి పూర్తిగా తెలియదని నా నమ్మకం. ఆ విషయాలే నన్ను ప్రభావితం చేశాయి. వాటిని అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే దర్శకుడు, నటీనటులు ఎవరనేది ప్రకటిస్తాం." -శివశర్మ, నిర్మాత
భాజపాలో సీనియర్ నాయకుడైన అటల్ బిహారీ వాజ్‌పేయి.. 2018 ఆగస్టు 16న మృతి చెందారు. భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు.
ఇది చదవండి: ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి జాలాది పురస్కారం