ETV Bharat / sitara

'ఆటల్లో రాజకీయాలు ఎత్తిచూపే సినిమా 'ఏ1 ఎక్స్​ప్రెస్''

'ఏ1 ఎక్స్​ప్రెస్' విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర విశేషాలను నిర్మాతలు పంచుకున్నారు. ఆటల్లో రాజకీయాల గురించి తమ సినిమాలో చర్చించామని వెల్లడించారు.

producers about A1 EXPRESS MOVIE
'ఏ1 ఎక్స్​ప్రెస్' సినిమా
author img

By

Published : Mar 3, 2021, 7:01 AM IST

సందీప్‌ కిషన్‌ హీరోగా, డెన్నిస్‌ జీవన్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'. టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈనెల 5న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.

A1 EXPRESS MOVIE
ఏ1 ఎక్స్​ప్రెస్​ సినిమాలో సందీప్, లావణ్య త్రిపాఠి

"తమిళంలో విజయవంతమైన 'నట్పే తునై' చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ కథను తెలుగులో తీయాలన్న ఆలోచన సందీప్‌ కిషన్‌దే. తనకిది 25వ సినిమా. హాకీ ఆట నేపథ్యంగా అల్లుకున్న ఆసక్తికర కథతో రూపొందించారు. ప్రస్తుతం ప్రతి క్రీడా రంగంలోనూ రాజకీయాలున్నాయి. దాని వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించనున్నాం. దీనితో పాటు ఓ అందమైన ప్రేమకథ ఉంటుంది. సినిమా వాస్తవికతకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో నిజమైన హాకీ స్టేడియాల్లో చిత్రీకరణ జరిపాం. హిప్‌హాప్‌ అందించిన నేపథ్య సంగీతం, పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి" అని నిర్మాతలు అన్నారు.

producers about A1 EXPRESS MOVIE
ఏ1 ఎక్స్​ప్రెస్ సినిమా నిర్మాతలు

"ప్రస్తుతం మా సంస్థలో 'మర్యాద కృష్ణయ్య', 'కార్తికేయ 2', 'ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి' సినిమాలు చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. రవితేజ - నక్కిన త్రినాథరావుతో చేయనున్న సినిమా ఏప్రిల్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది. నితిన్‌తో 'పవర్‌పేట' మే - జూన్‌లో సెట్స్‌పైకి వెళ్తుంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయని" నిర్మాతల్లో ఒకరైన టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.