ETV Bharat / sitara

'దిశ ఎన్​కౌంటర్'ను​ సినిమాగానే చూడండి: నట్టి కుమార్

చట్టానికి లోబడి 'దిశ ఎన్​కౌంటర్​'ను రూపొందిస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాత నట్టి కుమార్​ చెప్పారు. నవంబరు 26న సినిమా విడుదల చేస్తామని అన్నారు.

natti kumar
నట్టి కుమార్
author img

By

Published : Oct 11, 2020, 10:55 AM IST

సినిమాను సినిమాలాగా మాత్రమే చూడాలని 'దిశ ఎన్‌కౌంటర్' చిత్ర నిర్మాత నట్టి కుమార్ కోరారు. చట్టాలకు లోబడి దీనిని నిర్మిస్తున్నట్లు అయన తెలిపారు. ఎవరి మనోభావాలను కించపరిచే విధంగా తీయడంలేదని స్పష్టం చేశారు. ఇది దిశ బయోపిక్​ కాదని, మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలకు సంబంధించి అవగాహనను ప్రజల్లో తీసుకురావడానికే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపిన నట్టి.. న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు.

"ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు ఇంకా ఎలాంటి సర్టిఫికేట్‌ ఇవ్వలేదు. దిశ కమిషన్‌కు సంబంధించిన విషయాలు చిత్రంలో ఏమి చెప్పలేదు. నిజం నిర్భయంగా చూపించాం. గంట 50 నిమిషాలు వ్యవధి మాత్రమే ఉంటుంది. పోకిరీలు పెట్టే కామెంట్లపై మేం స్పందించం. పోలీసులు సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహారించాలి. రామ్‌గోపాల్ వర్మ హైదరాబాద్​ వచ్చిన తర్వాతే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం" అని నట్టి కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి ఇలాంటి సినిమా కోసమే చాలా రోజులుగా ఎదురుచుశా : విజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.