గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ మరో వేడుకలో సందడి చేశారు. బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్-2021లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అయితే ఇటీవలే బైక్ యాక్సిడెంట్ కారణంగా నిక్కు ఓ పక్కటెముక విరిగింది. అయినా కూడా వేడుకకు విచ్చేయడం పట్ల అతడిపై పొగడ్తల వర్షం కురిపించింది ప్రియాంక. భర్తను పొగుడుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. అలాగే పలు ఫొటోలు పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"పక్కటెముక విరిగినా నిక్‌ను ఎవరూ ఆపలేకపోయారు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది బేబీ. నువ్వొక గొప్ప వ్యక్తివి, చేసే పనిలో నిబద్ధత కలవాడివి. నాకు ప్రతిరోజూ స్ఫూర్తిగా నిలుస్తున్నావు. ఐ లవ్ యూ సో మచ్."
-ప్రియాంకా చోప్రా, నటి
ఈ వేడుకకు నిక్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. లాసె ఏంజెలిస్‌లోని మైక్రోసాఫ్ట్ థియేటర్లో పురస్కార ప్రధాన వేడుక అట్టహాసంగా జరిగింది.