బాలీవుడ్ అందాల భామ ప్రియాంక ప్రతిష్టాత్మక టొరంటో నేషనల్ ఫిల్మ్ పెస్టివల్‌లో ప్రధానాకర్షణగా నిలిచింది. తొలిసారి ఈ కార్యక్రమానికి వెళ్లిన ఈ భామ... ఆకట్టుకునే డిజైనర్ దుస్తులతో రెడ్ కార్పెట్ వేడుకలో సందడి చేసింది. కాగా ప్రీమియర్ పూర్తయిన తర్వాత ప్రియాంక భావోద్వేగానికి గురయ్యింది. దర్శకురాలు సోనాలీ బోస్‌ను హత్తుకుని కన్నీరు పెట్టుకుంది.
శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ప్రియాంక చోప్రాతో పాటు నటీనటులు ఫర్హాన్ అక్తర్, రోహిత్, శివానీ దండేకర్, దర్శకురాలు సోనాలీ బోస్ సహా చిత్రబృందం హాజరైంది. ఈ చిత్రోత్సవంలో ప్రియాంక నటించిన 'ద స్కై ఈజ్ పింక్' చిత్రం ప్రదర్శించారు. మెగా ఈవెంట్‌కు చెందిన పలు సిినిమాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుందీ బేవాచ్ స్టార్.
37 ఏళ్ల ప్రియాంక.. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ హిందీ చిత్రంలో కనువిందు చేయనుంది. అక్టోబర్ 11 ఆమె నటించిన 'ద స్కై ఈజ్ పింక్' ప్రేక్షకుల ముందకు రానుంది.
ఇదీ చదవండి...