కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండటం వల్ల ఇప్పటికే పలు దేశాల్లో లాక్డౌన్ విధించారు. భారత్‌కు విదేశాల నుంచి వచ్చే విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిషేధించారు. అయితే షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన 'ఆడు జీవితం' చిత్రబృందం.. ఈ వైరస్ ప్రభావం వల్ల అక్కడే చిక్కుకుపోయింది.
ఇంతకీ ఏం జరిగింది?
మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ నటిస్తున్న సినిమా 'ఆడు జీవితం'. కథలో భాగంగా చిత్రీకరణను జోర్డాన్‌లోని ఎడారిలో జరపాలని అనుకున్నారు. కొందరు హెచ్చరించినా వినుకుండా అక్కడికి వెళ్లారు. కరోనా తీవ్రరూపం దాల్చడం వల్ల మన దేశంలో లాక్డౌన్ విధించారు. విమానాలు వచ్చే పరిస్థితులు లేకపోవడం వల్ల వారంతా అక్కడే చిక్కుకుపోయారు. అయితే తమను ఎలాగైనా సరే భారత్‌కు తీసుకురావాలని వారు కోరుతున్నారు. సంబంధిత విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు పృథ్వీరాజ్.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన 58 మంది సభ్యులు జోర్డాన్‌లో చిక్కుకుపోయారు. తమకు సహాయపడాలని దర్శకుడు బెస్లీ.. కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడు. తిండి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నాడు. ప్రభుత్వమే దీనికి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశాడు.