ETV Bharat / sitara

కొత్త సినిమా ఫస్ట్​లుక్​పై స్పష్టతనిచ్చిన ప్రభాస్ - ప్రభాస్ వార్తలు

తన కొత్త సినిమా ఫస్ట్​లుక్​ను, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు కథానాయకుడు ప్రభాస్ తెలిపాడు. అయితే ఈ చిత్రానికి 'రాధేశ్యామ్' అనే పేరు పరిశీలనలో ఉంది.

కొత్త సినిమా ఫస్ట్​లుక్​పై స్పష్టతనిచ్చిన ప్రభాస్
ప్రభాస్
author img

By

Published : Jul 8, 2020, 10:39 AM IST

డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్​లుక్ విడుదల తేదీ వచ్చింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులు నిరీక్షణకు తెరదించుతూ జులై 10న ఉదయం 10 గంటలకు సోషల్ మీడియాలో పంచుకోనున్నట్లు ఇన్​స్టాలో వెల్లడించారు ఈ కథానాయకుడు. దీనితోపాటే ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

PRBHAS NEW MOVIE FIRST LOOK RELEASE DATE
ప్రభాస్ సినిమా ఫస్ట్​లుక్ అనౌన్స్​మెంట్ పోస్టర్

1920ల నాటి కథతో యూరప్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.