కరోనా సమయంలో నిస్సహాయులకు అపన్నహస్తం అందించి, మానవత్వాన్ని చాటుకున్న బాలీవుడ్ నటుడు సోనుసూద్‌ను విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ మర్యాదపూర్వకంగా సన్మానించారు. రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతున్న 'అల్లుడు అదుర్స్' సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన్ను, సెట్లో ప్రకాశ్‌రాజ్ తోపాటు చిత్ర యూనిట్ సాధార స్వాగతం పలికి గౌరవించింది.
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'అల్లుడు అదుర్స్'. ఇటీవలే చిత్రీకరణ పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా కీలక పాత్ర పోషిస్తున్న సోనుసూద్... సెట్లో అడుగుపెట్టడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.