'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'పౌర్ణమి'.. చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభుదేవా(Prabhu Deva Movies). తాజాగా ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నటనపై పూర్తి దృష్టి సారించి, డైరెక్షన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట.
కారణం అదేనా..?
దర్శకుడిగా ప్రభుదేవా(Prabhu Deva Movies).. గతంలో చేసిన చిత్రాలు ఘోర పరాజయాల్ని మూటగట్టుకున్నాయి. సల్మాన్ ఖాన్‌తో ఆయన తీసిన 'దబాంగ్ 3' ప్లాప్ టాక్ తెచ్చుకోగా.. ఇటీవల రిలీజైన 'రాధే' విమర్శలపాలైంది. దీంతో ఇకపై దర్శకత్వంవైపు వెళ్లకూడదని నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది.
2005లో విడుదలైన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో దర్శకుడిగా మారారు ప్రభుదేవా(Prabhu Deva Latest News). సిద్ధార్థ్, త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తరువాత ప్రభాస్‌తో 'పౌర్ణమి' చేశారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రం'పోకిరి'(Pokiri Remake In Tamil) ని తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టారు ప్రభుదేవా. ప్రస్తుతం ఆయన పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇదీ చదవండి: Raj Kundra Case: జైలు నుంచి విడుదలైన రాజ్ కుంద్రా