ETV Bharat / sitara

ప్రభాస్​ సినిమాలో సింగిల్ షాట్​ కోసం రూ.2కోట్లు! - ప్రభాస్​ కొత్త సినిమా

ప్రభాస్ కొత్త సినిమాలో ఒక్క సన్నివేశం కోసం ఏకంగా రూ.2 కోట్లను ఖర్చు చేశారట. ఇప్పుడీ విషయం టాలీవుడ్​లో చర్చనీయాంశమైంది.

Prabhas20: 150 people, 10 days and 2 crore for single shot
ప్రభాస్​ సినిమాలో సింగిల్ షాట్​ కోసం రూ.2కోట్లు!
author img

By

Published : Mar 12, 2020, 2:49 PM IST

డార్లింగ్​ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అందుకు తగ్గట్లుగానే దర్శకనిర్మాతలు కథలనూ సిద్ధం చేస్తున్నారు. వాటిలోని సన్నివేశాలు రిచ్​గా ఉండేలా చూసుకుంటున్నారు. ఇదే తరహాలో భారీ బడ్జెట్​తో 'సాహో'ను తీశారు. ఇప్పుడు #ప్రభాస్20కి అదే స్థాయిలో ఖర్చు చేస్తున్నారు.​ అందుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్​గా మారింది.

దర్శకుడు రాధాకృష్ణ తీస్తున్న పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. పూజా హెగ్డే హీరోయిన్. ఇందులోని ఓ సింగిల్​ షాట్​ కోసం చిత్రబృందం, ఏకంగా రూ.2 కోట్లను ఖర్చు చేసిందట. 10 రోజుల పాటు దాదాపు 150 మంది ఇందుకోసం పనిచేశారట.

Prabhas20: 150 people, 10 days and 2 crore for single shot
తన 20వ సినిమాలో హీరో ప్రభాస్

ఇంతకు ముందు రొమాంటిక్ సన్నివేశాల్ని చిత్రీకరించేందుకు ఏకంగా ఓ చెరువును, అందులో పడవను రూపొందించింది చిత్రబృందం. ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్లతో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: సాయితేజ్ కొత్త సినిమాకు పవర్​స్టార్ క్లాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.