ETV Bharat / sitara

అభిమానితో వీడియోకాల్‌లో మాట్లాడిన ప్రభాస్‌ - ప్రభాస్‌ వీడియోకాల్

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ అభిమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సర్​ప్రైజ్ ఇచ్చారు. వీడియోకాల్ చేసి అభిమానిని పలకరించి ఆమెకు ఆనందాన్ని పంచారు.

Prabhas
Prabhas
author img

By

Published : Sep 18, 2021, 9:19 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. ఇటీవల కాలంలో మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే తన అభిమాని(Prabhas Fans) కోసం వీడియో కాల్‌లో మాట్లాడి ఆమె ముఖంపై నవ్వులు కురిపించారు. కొన్నిరోజుల నుంచి శోభిత అనే అమ్మాయి అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ప్రభాస్
అభిమానితో వీడియోకాల్‌లో మాట్లాడుతూ..

ఇక డాక్టర్లు ఆమె ఇష్టాఇష్టాలను తెలుసుకోగా.. ప్రభాస్‌ అభిమానినని, ఆయనతో మాట్లాడాలని ఉందని చెప్పింది. శోభిత కోరిక మేరకు ప్రభాస్‌తో మాట్లాడించే ప్రయత్నం చేయగా.. శనివారం ప్రభాస్‌ వీడియో కాల్‌ చేసి(Prabhas Fans Videos) మాట్లాడి ఆమెకు ఆనందాన్ని పంచారు.

Prabhas
సలార్​లో ప్రభాస్

ప్రస్తుతం ప్రభాస్ పాన్‌ ఇండియా చిత్రాలు 'ఆదిపురుష్‌'(Prabhas Adipurush), 'సలార్‌' (Prabhas Salaar) షూటింగ్‌లతో(Prabhas Movies) బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన నటించిన 'రాధేశ్యామ్'(Prabhas Radhe Shyam) 2022 జనవరి 14న విడుదల కానుంది. 1970ల నాటి ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ విక్రమ్​గా, పూజాహెగ్డే ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు కీలకపాత్ర(Krishnam Raju Prabhas) పోషించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

Prabhas
రాధేశ్యామ్​లో ప్రభాస్-పూజాహెగ్డే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.